యూఏఈలో స్కైప్‌ పనిచేస్తోంది

- June 26, 2017 , by Maagulf
యూఏఈలో స్కైప్‌ పనిచేస్తోంది

యూఏఈలో కొందరు స్కైప్‌ వినియోగదారులు, ఉన్నపళంగా ఆ అప్లికేషన్‌ పని చేయకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈద్‌ సందర్బంగా తమవారికి స్కైప్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపేందుకు చాలామంది స్కైప్‌ వినియోగదారులు ప్రయత్నించగా, వారిలో కొందరికి సమస్యలు ఎదురయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన టెక్నికల్‌ టీమ్‌, కొన్ని ప్లాట్‌ఫామ్స్‌ మీద స్కైప్‌ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు గుర్తించామని తెలిపారు. మరోవైపు కొందరు అక్రమార్కులు హ్యాకింగ్‌కి పాల్పడటం కూడా స్కైప్‌ సమస్యలకు కారణమని వారు వెల్లడించారు. ఇంకో వైపున స్కైప్‌ యాజమాన్యం, కొన్ని ప్లాట్‌ఫామ్స్‌ మీద స్కైప్‌ సేవల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మిగతా అన్ని సందర్భాల్లోనూ స్కైప్‌ యధాతథంగా పనిచేస్తోంది. 
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com