స్వదేశీ పరిజ్ఞానంతో చైనాలో వేగవంతమైన బుల్లెట్ రైలు ప్రారంభం
- June 26, 2017
స్వదేశీ పరిజ్ఞానంతో చైనా అభివృద్ధి చేసిన అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైలు సోమవారం ప్రారంభమైంది. 'ఫక్సింగ్'గా పిలుస్తున్న ఈ అత్యాధునిక రైలు అత్యధికంగా గంటకు 400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. దేశంలోనే అత్యంత రద్దీ మార్గంగా పేరొందిన బీజింగ్-షాంఘై మార్గంలో సోమవారం 'ఫక్సింగ్' రాకపోకలను ప్రారంభించారు. 'సీఆర్400 ఏఎఫ్' రకానికి చెందిన ఈ రైలు కేవలం 5 గంటల 45 నిమిషాల్లో బీజింగ్ దక్షిణ రైల్వే స్టేషన్ నుంచి షాంఘై చేరుకుంది. మార్గమధ్యంలో 10 స్టేషన్లలో ఆగింది. అత్యవసర, ప్రమాదకర పరిస్థితుల్లో వేగం తగ్గించుకునేందుకు, స్వీయ ప్రదర్శనను నిరంతరం మదింపు చేసుకునేందుకు వీలుగా 'ఫక్సింగ్'లో అత్యాధునిక పర్యవేక్షణ వ్యవస్థ ఉంది. రిమోట్ డేటా ట్రాన్స్మిషన్ వ్యవస్థ, కంట్రోల్ కేంద్రం ద్వారా ఎప్పటికప్పుడు ఈ రైలును నియంత్రించవచ్చు.
తాజా వార్తలు
- పోస్టాఫీస్‌లో అద్భుతమైన స్కీమ్..
- నోబెల్ గ్రహీత నర్గెస్‌కు మరో ఏడున్నరేళ్ల జైలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ
- NEET UG 2026 నోటిఫికేషన్ విడుదల..
- గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..సీఎం సీరియస్
- అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్
- హైదరాబాద్‌లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం
- తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వేడిగాలులు
- పాపిరెడ్డిపాళెంలో 9 రోజుల ఉచిత కంటి వైద్య శిబిరం
- కువైట్ లో అనధికార ఫుడ్ సెల్లర్స్ పై కొరడా..!!









