దాతృత్వం పాఠశాల నుంచే ప్రారంభం....అబుదాబి విద్యార్థుల వితరణ
- June 27, 2017
ఇస్లామిక్ శాఖకు చెందిన విద్యార్థులచే స్వచ్ఛంద కార్యక్రమం ఏర్పాటు చేయబడింది..సహాయం చేసే గుణం ఇంటి వద్ద నుంచే ఆరంభమవుతుంది...కానీ అబూధాబి పాఠశాల విద్యార్ధులు పాఠశాల నుంచి యోచించారు.సెయింట్ జోసెఫ్స్ స్కూలులోని విద్యార్ధులు పాఠశాల బస్సు డ్రైవర్లకు, బస్ కండక్టర్లకు, నాన్-టీచింగ్ సిబ్బందికి ,గేట్ల వద్ద నిలిచి ఉండే సిబ్బందికి సహాయం అందించారు." వారు తమ జీవితాలలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు " విద్యార్థులు పేర్కొన్నారు. 2017 ఏడాదిగాను "సహాయం చేసే సంవత్సరం" (గివింగ్ ఇయర్) గా గుర్తించారు. ఆ నేపథ్యంలో పాఠశాలలో ఈ స్వచ్ఛంద కార్యక్రమం జరిగింది. ఈ సంఘం యొక్క సభ్యులకు మా కృతజ్ఞతను తెలియచేయాలని మేము కోరుకొంటున్నాం ,ఈ సహాయం ఒక అమూల్యమైన పని అని, తరచుగా వారి సేవలు గుర్తించబడవని అన్నారు. అయితే, డ్రైవర్లు, బస్ కండక్టర్లు మరియు డోర్ మెన్ (ద్వారపాలకులు) పాఠశాల జీవితంలో విద్యార్థుల కోసం ముఖ్య పాత్ర పోషిస్తారని , విద్యార్థులు ఈ వయస్సు నుంచే ఈ ప్రాముఖ్యతని గుర్తించటం అత్యవసరం "అని సిస్టర్ కార్మెన్ తెలిపారు. విద్యార్థులు ప్రతి వ్యక్తికి టూత్ బ్రష్, టూత్ పేస్ట్ , సబ్బు, షాంపూ, హెయిర్ ఆయిల్ మరియు ఇతర ఉత్పత్తులను విద్యార్థులచే అందచేబడ్డాయి.ఉపాధ్యాయ సిబ్బందిలో దాదాపు అందరు ప్రవాసీయులు కావడంతో మా విద్యార్థులు వారందరికీ అంతర్జాతీయ మొబైల్ కార్డులను సైతం అందించారని ఆమె తెలిపారు. ఇస్లామిక్ డిపార్ట్ మెంట్ విద్యార్ధులు స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ సహాయం ఏర్పాటు చేశారు." సమాజం నుండి మనం ఎక్కువ తీసుకోవడం కన్నా, మనమే ఎక్కువ ఇవ్వాలని మా పాఠశాలలో టీచర్లు బోధించారని " ఒక విద్యార్థి " మా గల్ఫ్ న్యూస్ డాట్ కామ్ " కు తెలిపారు .
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







