రమదాన్ మాసంలో 26 టన్నుల అక్రమ ఆహార పదార్థాలు స్వాధీనం
- June 28, 2017
రియాద్: పవిత్ర రమదాన్ మాసంలో పెద్దయెత్తున ఫుడ్ స్టఫ్‌ని అక్రమంగా అమ్మకందార్లు వినియోగదారులకు అంటగట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ ఏడాది కూడా అలాంటి ప్రయత్నాలు చాలానే జరిగాయి. ఈ నేపథ్యంలో రమదాన్ మాసమంతటా ప్రత్యేక తనిఖీల్ని చేపట్టింది సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (ఎస్ఎఫ్డిఎ). ఈ క్రమంలో 26 టన్నుల అక్రమ ఆహార పదార్థాల్ని సీజ్ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. నిన్నటితో ఈ తనిఖీలు పూర్తయ్యాయి. పాత మేకింగ్ తేదీల్ని టాంపరింగ్ చేయడం, కొత్త ప్యాక్‌లలో పాత ఆహార పదార్థాల్ని చొప్పించి విక్రయించడం ఇలా చాలా అభియోగాల మేరకు ఈ ఆహార పదార్థాల్ని సీజ్ చేయడం జరిగింది. 22 టన్నుల రైస్‌ని ఓ వేర్ హౌస్‌లో గుర్తించారు. పాత బియ్యాని కొత్త లేబుల్స్‌తో టేంపర్ చేసినట్లు గుర్తించారు. మకరోని, చిల్లీ సాస్, ఆలివ్ ఆయిల్ వంటివి వినియోగానికి వీలు కాకపోయినా, వాటిని ఆకర్షణీయమైన ప్యాక్లలోకి మార్చారు నిందితులు. లెమన్, ఆర్గానిక్ డ్రింక్ వంటివి సుమారు 9,437 లీటర్ల మేర సీజ్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా
- ఐఐటీ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
- అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన ఏపీ: మంత్రి రవీంద్ర
- జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మీడియా అకాడమీ..రూ.లక్ష ఆర్థిక సహాయం
- బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!
- సైబర్ మోసాలకు చెక్.. వింగో యాప్ క్లోజ్!
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!
- సౌదీలో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- దోహా చేరుకున్న జర్మనీ ఛాన్సలర్..!!
- ట్రాఫిక్ అలెర్ట్.. కీలక గల్ఫ్ స్ట్రీట్ మూసివేత..!!







