ఎయిర్ అంబులెన్సు సర్వీస్ ను మొదలుపెట్టిన అపోలో హాస్పిటల్
- June 28, 2017
అత్యవసరంగా వైద్య సేవలు అందించడానికి గతంలో ప్రారంభించిన ఎయిర్ అంబులెన్స్ సేవలను ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించనున్నట్లు ప్రముఖ వైద్యారోగ్య సేవల సంస్థ అపోలో హాస్పిటల్స్ ప్రకటించింది. బెంగళూరుకు చెందిన విమానయాన సంస్థ ఏవియేటర్స్ ఎయిర్ రెస్క్యూతో కలిసి నిర్వహిస్తున్న ఈ సేవలను కరీంనగర్‌తోపాటు కాకినాడ, వైజాగ్, కరైకుడి, కరూర్, మధురై, తిరుచిరాపల్లి, మైసూర్ నగరాల్లో త్వరలో అందుబాటులోకి రానున్నట్లు అపోలో హాస్పిటల్స్ వైస్-చైర్మన్ ప్రీథా రెడ్డి తెలిపారు.
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్ల ద్వారా ప్రయాణ సమయం 90 శాతం వరకు తగ్గనుండగా, అలాగే అత్యవసరంగా మెడికల్ సేవలు అందించడానికి వీలుంటుందని ఆమె వెల్లడించారు. ఇందుకోసం గంటకు రూ.1.60 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు చార్జీ చేయనున్నట్లు ఆమె తెలిపారు. కాగా, 2003లోనే ఎయిర్ అంబులన్స్ సర్వీసులను అపోలో హాస్పిటల్స్ ప్రారంభించింది. న్యూఢిల్లీ, బెంగూళరు లాంటి నగరాలకు మొదట విస్తరించింది. ఏడాదిలో 125-150మంది రోగులను ఈ సర్వీసుల ద్వారా చేరవేస్తోంది.
తాజా వార్తలు
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!
- సౌదీలో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- దోహా చేరుకున్న జర్మనీ ఛాన్సలర్..!!
- ట్రాఫిక్ అలెర్ట్.. కీలక గల్ఫ్ స్ట్రీట్ మూసివేత..!!
- నెస్లే మరో బ్యాచ్ బేబీ ఫార్ములా రికాల్..!!
- వకాన్ విలేజ్ కు పోటెత్తిన విజిటర్స్..!!
- దుబాయ్ స్కూళ్లలో ఏఐ (AI) పాఠాలు
- నైజీరియాలో 200 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు
- కేదార్నాథ్: యాత్రికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. సురక్షిత ప్రయాణం
- ఉగాది, కళారత్న పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం







