జులై 1 లోగా ఆధార్-పాన్ అనుసంధానం తప్పనిసరి

- June 28, 2017 , by Maagulf
జులై 1 లోగా ఆధార్-పాన్ అనుసంధానం తప్పనిసరి

పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. జులై 1 నుంచి పాన్-ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదాయపు పన్ను నిబంధనల్లో చేసిన సవరణలను కేంద్రం నోటిఫై చేసింది. దీని ప్రకారం 12 అంకెల ఆధార్ నంబర్ను పాన్కు దరఖాస్తు చేసుకునే సమయంలో తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. సంక్షేమ పథకాల కింద లబ్ధి పొందాలంటే ఆధార్ తప్పనిసరిగా ఉండాలని కేంద్రం జారీ చేసిన ప్రకటనపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆధార్-పాన్ అనుసంధాన్ని తప్పనిసరి చేస్తూ మరుసటి రోజే నిర్ణయం తీసుకుంది.

'జులై 1, 2017 నుంచి పాన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తి తమ ఆధార్ నంబర్ను సెక్షన్ 139ఏఏలోని సబ్సెక్షన్(2) ప్రకారం తప్పనిసరిగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంకమ్ ట్యాక్స్-డీజీఐటీ(సిస్టమ్స్)కు తెలియజేయాల్సి ఉంటుంది' అని రెవెన్యూ డిపార్ట్మెంట్ పేర్కొంది. ఆదాయపు పన్ను చట్టంలోని 114వ నిబంధనలో సవరణలు చేసినట్లు పేర్కొంది. దీని ప్రకారం జులై 1 నుంచి ఐటీ రిటర్న్స్ ఫైలింగ్కు ఆధార్-పాన్ అనుసంధానం తప్పనిసరి అని కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖ(సీబీడీటీ) స్పష్టం చేసింది. దేశంలో మొత్తం 25 కోట్ల మంది పాన్ కార్డు కలిగి ఉండగా.. 111 కోట్ల మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి. ఇప్పటికే పన్ను చెల్లిస్తున్న సుమారు 2.07 కోట్ల మంది తమ పాన్ కార్డులను ఆధార్తో అనుసంధానం చేసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com