పుల్లెల గోపీచంద్ బయోపిక్
- June 28, 2017
ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారుడు, ప్రద్మశ్రీ అవార్డు గ్రహీత పుల్లెల గోపీచంద్ జీవితాధారంగా బయెపిక్ రాబోతోంది. బాలీవుడ్ నిర్మాత విక్రమ్ మల్హోత్రాఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తెలుగు, హిందీలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
'నాపై సినిమా రాబోతున్నందుకు సంతోషంగా ఉంది. విక్రమ్ తీయబోయే చిత్రంతో బాడ్మింటన్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిచెందుతుందని ఆశిస్తున్నాను' అని గోపీచంద్ మీడియాతో అన్నారు. గోపీచంద్ 2001లోఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బాడ్మింటన్ ఛాంపియన్షిప్లో గెలిచారు. ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారుడు, దీపిక పదుకొణె తండ్రి ప్రకాశ్ పదుకొణె తర్వాత ఆ రికార్డు కైవసం చేసుకుంది గోపీచందే. ఆ తర్వాతగోపీచంద్ హైదరాబాద్లో అకాడమీ ప్రారంభించారు. గోపీచంద్ శిక్షణలో ఒలింపిక్ రజత పతాకం గెలుచుకున్న పీవీ సింధుపై కూడా బయెపిక్ వస్తుండడం గమనార్హం. నటుడు, నిర్మాత సోనూ సూద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీచంద్ పాత్రలో సుధీర్ బాబు నటిస్తున్నట్టు సమాచారం
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







