పిబిబివై ఇన్స్యూరెన్స్‌ క్లెయిమ్‌ సులభతరం

- June 28, 2017 , by Maagulf
పిబిబివై ఇన్స్యూరెన్స్‌ క్లెయిమ్‌ సులభతరం

ఎమిగ్రేషన్‌ క్లియరెన్స్‌ రిక్వైర్డ్‌ (ఇసిఆర్‌) ఇండియన్‌ పాస్‌పోర్ట్‌ హోల్డర్స్‌, ప్రవాసీ భారతీయ భీమా యోజన (పిబిబివై) పేరుతో ఇన్స్యూరెన్స్‌ పాలసీని తీసుకోవడం తప్పనిసరి. 10 లక్షల వరకు ఇన్స్యూరెన్స్‌ కవరేజ్‌ ఉంటుంది ఈ విభాగంలో. పనికి సంబంధించిన మరణం, లేదంటే శాశ్వత అంగవైకల్యం ఎమిగ్రేంట్‌కి కలిగితే, ఈ మొత్తాన్ని సంబంధీకులకు అందజేస్తారు. అలాగే ఈ ఇన్స్యూరెన్స్‌ కింద 75,000 రూపాయల వరకు మెడికల్‌ ఎక్స్‌పెన్సెస్‌ కోసం వినియోగించవచ్చు. మెటర్నిటీ బెనిఫిట్‌ కింద 25,000 వరకూ, లీగల్‌ ఖర్చుల కింద 30,000 వరకూ లబ్ది పొందే అవకాశం ఉంది. ఇన్సూరెన్స్‌ క్లెయిమ్స్‌కి సంబంధించి ఇప్పటిదాకా నామినీలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో మరింత సులభతరంగా క్లెయిమ్‌ ప్రాసెస్‌ని అందుబాటులోకి వచ్చింది. ఇ-మైగ్రేట్‌ సిస్టమ్‌ ద్వారా ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. పిబిబివై కింద క్లెయిమ్స్‌ని డైరెక్ట్‌గా సంబంధిత ఇన్సూరెన్స్‌ కంపెనీలు పరిష్కరించనున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com