చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ బంపర్ ఆఫర్

- June 28, 2017 , by Maagulf
చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ బంపర్ ఆఫర్

చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్..మెగా మాన్‌సూన్ సేల్ పేరుతో ప్రత్యేక ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కింద ప్రారంభ విమాన టిక్కెట్ ధరను రూ.699గా నిర్ణయించింది. జమ్ము-శ్రీనగర్‌, గువహటి-అగర్తలా, ఐజ్వాల్‌-గువహటితో పాటు మరికొన్ని మార్గాల్లో ప్రయాణించాలనుకుంటున్న ప్రయాణికుల కోసం ఈ ఆఫర్‌ను అందిస్తున్నట్లు పేర్కొంది.
బుకింగ్ చేసుకున్న ప్రయాణికులకు మరో ఆఫర్‌ను కూడా వుంది. టికెట్టు బుక్ చేసుకున్న వారిలో లక్కీడ్రాలో ఎంపిక చేసి దుబాయ్‌, మాలే, కొలంబో, బ్యాంకాక్‌ వెళ్లేందుకు హాలిడే ప్యాకేజ్‌ను ఆఫర్ చేయనున్నట్లు పేర్కొంది.
నిర్ణీత సంఖ్యలో మాత్రమే ఉన్న ఈ టికెట్లనునేటి నుంచి వచ్చేనెల 4 వరకు బుక్ చేసుకోవచ్చు. బుకింగ్‌లు చేసుకున్న ప్రయాణికులు వచ్చేనెల 14 నుంచి వచ్చే ఏడాది మార్చి 24 మధ్య ప్రయాణించవచ్చని ప్రకటించింది స్పైస్‌జెట్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com