మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ ఫోర్జరీ: వ్యక్తికి జైలు

- June 29, 2017 , by Maagulf
మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ ఫోర్జరీ: వ్యక్తికి జైలు

తన భార్య కోసం వీసా పొందేందుకు మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ని ఫోర్జరీ చేసినందుకుగాను ఓ వ్యక్తికి మూడేళ్ళ జైలు శిక్ష పడింది. జులై 12న నిందితుడ్ని అరెస్టు చేయడం జరిగింది. భార్య వీసాకి సంబంధించి ప్రాసెస్‌ పూర్తి చేసుకునే క్రమంలో నిందితుడు మినిస్ట్రీ ఆఫ్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌ని సంప్రదించిన సందర్భంగా నిందితుడి నేరాన్ని గుర్తించారు. శ్రీలంకకు చెందిన వ్యక్తి ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఫోర్జరీ సర్టిఫికెట్‌ కోసం 1,200 దిర్హామ్‌ని చెల్లించినట్లుగా న్యాయస్థానం యెదుట వెల్లడించాడు. కొలంబోలోని యూఏఈ ఎంబసీకి చెందిన స్టాంప్‌ని ఫోర్జరీ చేసినట్లు ప్రాసిక్యూటర్‌ తెలిపారు. న్యాయస్థానంలో విచారణ సందర్భంగా నిందితుడు తన నేరాన్ని అంగీకరించలేదు. అయినప్పటికీ అతనికి జైలు శిక్ష ఖరారు చేసిన న్యాయస్థానం, జైలు శిక్ష పూర్తయిన అనంతరం డిపోర్టేషన్‌ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com