ఆసియా దేశాల అక్రమ వలసదారుల బహిష్కరణ

- October 15, 2015 , by Maagulf
ఆసియా దేశాల అక్రమ వలసదారుల బహిష్కరణ

ఆసియా దేశాలకు చెందిన 94 మంది అక్రమ వలసదారుల్ని రాయల్‌ ఒమన్‌ పోలీసులు బహిష్కరించారు. ఒమన్‌లోకి వారంతా అక్రమంగా ప్రవేశిస్తుండగా, వారిని రాయల్‌ ఒమన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇంకో వైపు వివిధ దేశాలకు చెందిన 80 మందిని దేశంలోకి అక్రమంగా చొరబడిన కారణంగా అరెస్ట్‌ చేయడం జరిగింది. వారిలో 29 మందిపై చట్టపరంగా చర్యలు తీసుకుని, దేశం నుంచి బయటకు పంపారు. బతినా పోలీసులు ఓ వాహన రిపేర్‌ వర్క్‌ షాప్‌పై దాడి చేసి, ఎనిమిది మందిని అరెస్ట్‌ చేశారు. 17 వాహనాల్ని సీజ్‌ చేశారు. మరో సందర్భంలో దొంగతనం చేస్తున్న ముగ్గుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 14,700 ఒమన్‌ రియాల్స్‌ని వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.  కార్డ్‌ లేకపోతే ప్రయాణం కష్టం హఫిలాత్‌ కార్డులు లేకపోతే ఇకపై బస్సుల్లో ప్రయాణించడం కుదరదు. బస్సుల్లో టిక్కెట్ల కొనుగోలుకు నగదు వినియోగించకుండా వాటి స్థానంలో స్మార్ట్‌ కార్డ్స్‌ని తీసుకొచ్చింది ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌. గతంలోనే ఈ పద్ధతిని అమల్లోకి తెచ్చినా, పూర్తిగా నగదు వినియోగాన్ని నిషేధించలేదు. అయితే ఈ మధ్యనే నగదును పూర్తిగా నిషేధించడంతో బస్సుల్లో ప్రయాణిస్తున్నవారు ఇబ్బందులకు గురవుతున్నారు. కార్డ్‌ లేకపోవడంతో తాను బస్సులో ప్రయాణించలేకపోయాననీ, నగదుతో టిక్కెట్‌ కొనే పద్ధతిని నిషేధించినట్లు తనకు సమాచారం లేదని ఓ ప్రయాణీకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌, ముందుగానే అందరికీ తెలియజేశామనీ, కార్డుల వినియోగం తప్పనిసరి అని ప్రకటించిన తర్వాత కూడా పూర్వపు పద్ధతులపై ప్రయాణీకులు మోజు చూపడం తగదని చెబుతుంది. బస్‌ స్టాపుల్లో సుమారు 140 స్విప్ట్‌ రిలోడింగ్‌ మెషీన్లను ఏర్పాటు చేశామనీ, వాటి ద్వారా కార్డులను పొందడం, రీఛార్జ్‌ చేసుకోవడం వంటి సౌకర్యాల్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రయాణీకులకు అధికారులు సూచించారు. కార్డుకి సంబందించి ఏవైనా సాంకేతిక ఇబ్బందులు ఉన్నట్లయితే అధికారులను సంప్రదించాలని ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఓ ప్రకటనలో తెలియజేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com