భారీ అగ్ని ప్రమాదాన్ని అదుపులోకి తెచ్చిన ఫైర్‌ ఫైటర్స్‌

- June 29, 2017 , by Maagulf
భారీ అగ్ని ప్రమాదాన్ని అదుపులోకి తెచ్చిన ఫైర్‌ ఫైటర్స్‌

ఓ ఫ్యాక్టరీలోని లూబ్రికెంట్స్‌ మరియు ఆయిల్‌ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సార్జా ఇండస్ట్రియల్‌ ఏరియా నెంబర్‌ 10లో జరిగిన ఈ అగ్ని ప్రమాదం గురించిన సమాచారం అందుకోగానే, ఫైర్‌ ఫైటర్స్‌ అక్కడికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చారు. పక్కనే ఉన్న వేర్‌హౌస్‌లకు అగ్ని కీలలు వ్యాపించకుండా ఫైర్‌ఫైటర్స్‌ వీరోచితంగా అగ్ని కీలలతో పోరాడారు. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ షార్జా సివిల్‌ డిఫెన్స్‌ కల్నల్‌ సమి అల్‌ నకాబి మాట్లాడుతూ, మంటల్ని అదుపు చేయడానికి చాలా సమయం పట్టిందన్నారు. లూబ్రికెంట్స్‌, ఆయిల్‌ మంటల కారణంగా ఇంత సమయం పట్టిందని తెలిపారాయన. నాలుగు గంటలపాటు ఈ ఆపరేషన్‌ కొనసాగింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కంపెనీలు నిబంధనల్ని ఉల్లంఘించి వ్యవహరించడం, తగిన భద్రతా చర్యలు చేపట్టకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయనీ, సివిల్‌ డిఫెన్స్‌ ఎప్పటికప్పుడు భద్రతా ప్రమాణాల విషయంలో తనిఖీలు నిర్వహిస్తుందని తెలిపారు కల్నల్‌ సమి అల్‌ నకాబి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com