విజయవాడ నుంచి విదేశాలకు డైరెక్ట్ ఫ్లైట్
- June 29, 2017
ఆంధ్రప్రదేశ్‌కే తలమానికంగా మారిన గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఇక అంతర్జాతీయ ఖ్యాతిని అందుకోనుంది. దేశ, విదేశీ విమానాలరాకపోకలతో కళకళలాడనుంది. ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ఏపీ ప్రజలు అశలు నెరవేరబోతున్నాయి. గన్నవరం ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ విమానాశ్రయ హోదా లభించింది. దీంతో ఈ ఎయిర్‌పోర్టు అంతర్జాతీయ స్థాయికి ఎగబాకింది. దేశంలోనే ఆక్యుపెన్సీపరంగా దూసుకుపోవడంతో ఈ ఖ్యాతిని త్వరితగతిన అందుకోగలిగింది.అంతర్జాతీయ విమానాశ్రయ హోదా లభించడంతో త్వరలోనే ఈ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా అగ్రదేశాలైన అమెరికా, దుబాయ్, సింగపూర్, మలేషియా వంటి విమాన సర్వీసులు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తొలుత దుబాయ్‌కి విమాన సర్వీసులు నడపాలని భావిస్తున్నారు. ఈ మేరకు దుబాయ్‌కు చెందిన ఎమిరైట్స్ ఎయిర్‌లైన్స్ సంస్ధతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ సర్వీస్ ప్రారంభమైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దేశాలకు నేరుగా విమాన ప్రయాణం సులభతరంకానుంది.గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ మీదుగా విదేశాలకు వెళ్తున్న ప్రయాణీకులకు ఇక నుంచి పడిగాపులు తప్పనున్నాయి. ప్రస్తుతం విదేశీ విమాన సర్వీసుల కోసం బోయింగ్ 737-800, ఎయిర్‌బస్ 319,320,321 విమాన రాకపోకలు సాగించేందుకు ఎయిర్‌పోర్టు రన్‌వే అనువుగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు.
ఈ ఏడాది ఆగస్టు నుంచే విమాన సర్వీసులను ప్రారంభించాలనే లక్ష్యంగా పౌర విమానశాఖ పలు విమాన సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పటికే విజయవాడలో జరిగిన సివిల్ ఏవియేషన్ సమ్మిట్‌లో సింగపూర్, దుబాయ్‌కు చెందిన విమాన సంస్థలతో డీల్ కుదుర్చుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో ఇప్పటికే 162 కోట్ల రూపాయలతో ట్రాన్సిట్ టెర్మినల్‌ను ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. భారీ విమాన రాకపోకలు సాగించేందుకు వీలుగా మరో 100 కోట్లతో పనులు చేపట్టారు. తొలి విడత విస్తరణ పనుల్లో భాగంగా ప్రస్తుతం 2,286 మీటర్ల పొడవు ఉన్న రన్‌వేను 3,360 మీటర్లకు పెంచుతున్నారు. మొత్తానికి గన్నవరం ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ విమానాశ్రయ హోదా దక్కడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
తాజా వార్తలు
- అంబటి రాంబాబు ఇంటి పై దాడి..హైకోర్టు సీరియస్
- ఇది ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు
- టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ...రవిచంద్రకు బాధ్యతలు
- ఫోన్ ట్యాపింగ్ కేసు.. KCR విచారణ ప్రారంభం
- విజయవాడలో వైభవంగా 'వివేకానంద మానవ వికాస కేంద్రం' ప్రారంభోత్సవం
- QR14.667 బిలియన్లకు POS, ఇ-కామర్స్ లావాదేవీలు..!!
- ఆప్టామిల్ మిల్క్ పౌడర్ పై SFDA క్లారిటీ..!!
- దక్షిణ ఇరాన్లో భూకంపం..యూఏఈ సేఫ్..!!
- కువైట్ లో వేలానికి 208 వాహనాలు..!!
- ఒమన్ లో తప్పిపోయిన చిన్నారి సురక్షితం..!!







