శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ

- July 01, 2017 , by Maagulf
శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ

శ్రీనువైట్ల - రవితేజలది హిట్ కాంబినేషన్. దర్శకుడిగా శ్రీనువైట్ల ప్రయాణం 'నీకోసం'తో మొదలైంది. అందులో హీరో రవితేజనే. 'దుబాయ్ శీను'తో ఇద్దరూ హిట్ కొట్టారు. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలసి పనిచేయబోతున్నారని సమాచారం. 'మిస్టర్' తరవాత ఓ కథని సిద్ధం చేసుకొన్నారు శ్రీనువైట్ల. ఆ కథ రవితేజకు బాగా సరిపోతుందని భావిస్తున్నారట. ఇందుకు సంబంధించి రవితేజ - శ్రీనువైట్ల మధ్య చర్చలు సాగాయని, శ్రీనుతో కలసి పనిచేయడానికి రవితేజ సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుందని వార్తలొస్తున్నాయి. 'రాజా ది గ్రేట్', 'టచ్ చేసి చూడు' సినిమాలతో బిజీగా ఉన్నాడు రవితేజ. అవి పూర్తయ్యాకే.. శ్రీనువైట్ల సినిమాపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com