బ్రూస్ లీ:రివ్యూ
- October 16, 2015
రామ్ చరణ్ , చిరంజీవి , రాకుల్ ప్రీతి సింగ్ శ్రీను వైట్ల డి.వి.వి. దానయ్య తమన్ అక్టోబర్ 16, 2015 తెలుగు మిర్చి రేటింగ్ : 3.25/5 - మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన బ్రూస్ లీ చిత్రం దసరా కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది..దాదాపు ఆరేళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రం లో కనిపించడం తో మెగా ఫాన్స్ అంచనాలు బాగానే పెట్టుకున్నారు.మరి వారి అంచనాలను ఎంత మాత్రం అందుకుందో ఇప్పుడు చూద్దాం. కథ : మధ్య తరగతికి చెందిన రావు రమేశ్ కు ఓ కొడుకు కార్తి (రామ్ చరణ్ ) , ఓ కుమార్తె (కృతి ఖర్బంద) ఇద్దరు కూడా చదువులలో ఫస్ట్. అయితే చిన్నప్పటి నుండే కార్తి సిస్టర్ కు ఐఎఎస్ కావాలని కోరిక..ఆ కోరిక తీర్చడం కోసం తండ్రి అప్పుల పాలవుతాడు..దీంతో కార్తి ఫైట్ మాస్టర్ గా మారి చెల్లెలి ఫీజు కడతాడు..కానీ తన తండ్రికి కార్తి అలా చదవు మానేసి ఫైట్ మాస్టర్ అవడం ఇష్టం ఉండదు..దీంతో కార్తి ఫై కోపం పెంచుకుంటాడు..అదే టైం లో కృతి ఖర్బంద పెద్ద సమస్య లో చిక్కుకుంటుంది..ఆ టైం లో కార్తి పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు.. ఫైట్ మాస్టర్ నుండి పోలీస్ ఆఫీసర్ ఎలా అయ్యాడు..? కృతి ఖర్బంద కు వచ్చిన సమస్య ఏంటి..? ఆమె ఎలా బయటపడుతుంది..? అనేది మీరు తెరఫై చూడాల్సిందే.. ప్లస్ : మొదటగా ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అంటే చిరంజీవి అని చెప్పాలి..చేసింది గెస్ట్ రోల్ అయిన సినిమా అంచనాలు పెచ్చింది మాత్రం చిరు అనే చెప్పాలి.దాదాపు ఆరేళ్ళ తర్వాత సిల్వర్ స్క్రీన్ ఫై కనిపించడం తో అందరి దృష్తి బ్రూస్ లీ ఫై పడేలా చేసింది..చిరు ఎంట్రీ తో ధియేటర్ లో కేకలు , అరుపులతో మారుమోగిపోయింది..చిరు చెప్పే డైలాగు "జస్ట్ టైం గ్యాప్ ..టైమింగ్ లో గ్యాప్ వుండదు " అని చెప్పడం తో అందరు 150 వ చిత్రం కోసమే ఈ డైలాగు అని ఫిక్స్ అయ్యారు.. కార్తి పాత్ర లో కొత్త రామ్ చరణ్ ని చూస్తాం..ఇప్పటివరకు యాక్షన్ పాత్రలతో అలరించిన చరణ్ మొదటిసారిగా పూర్తిస్థాయి ఫ్యామిలీ క్యారెక్టర్ లో కనిపించి అందర్ని ఆకట్టుకున్నాడు.. చరణ్ లుక్ చాలా స్టైలిష్ గా ఉంది , అలాగే డాన్స్ గురించి మనం చెప్పనక్కరలేదు, ఆ బ్లడ్ లోనే డాన్స్ ఉంది.. రామ్ చరణ్ - రాకుల్ మద్య వచ్చే లవ్ ట్రాక్ గాని సాంగ్స్ లలో కానీ ప్రేక్షకులు ఫిదా అవ్వాల్సిందే .ముఖ్యంగా రాకుల్ గ్లామర్ సినిమా అదనపు ఆకర్షణ..ఇప్పటి వరకు కనిపించని విధంగా ఈ చిత్రం లో చాల అందంగా కనిపించి అబిమానులను అలరించింది.. ఇక సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అంత జెట్ స్పీడ్ గా , కామెడీ , యాక్షన్, సాంగ్స్ తో అలరించి, ఇంటర్వల్ లో అసలుసీసలైన ట్విస్ట్ పెట్టి సెకండ్ హాఫ్ ఫై ఆసక్తి రేపుతుంది.. రామ్ చరణ్ కు సిస్టర్ పాత్రలో కృతి కర్బంధ అందంగా కనిపించి , తన నటన తో మంచి మార్కులు కొట్టేసింది..రావు రమేష్, పవిత్రా లోకేష్, సప్తగిరి, డైరెక్టర్ గా జయప్రకాశ్ రెడ్డి, హీరోగా బ్రహ్మాజీ, పోసాని కృష్ణ మురళి వారి పాత్రలకు నాయ్యం చేసారు..తమన్ మ్యూజిక్ కూడా సినిమా కు మరో ప్లస్ అని చెప్పాలి..సాంగ్స్ తగట్టు లొకేషన్స్ కూడా ఆదరగోట్టాయి.. మైనస్ : చిత్రానికి పెద్ద మైనస్ అంటే సెకండ్ హాఫ్ అని చెప్పాలి..ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత స్పీడ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి తగ్గింది..శ్రీను వైట్ల సినిమా వస్తుంది అంటే కామెడీ ఎక్కువగా ఉంటుందని భావిస్తారు కానీ అది ఇందులో తగ్గింది..స్టొరీ కూడా పాతదే..కొత్త స్టొరీ చూసాం అనే ఫీలింగ్ మాత్రం ఆడియన్స్ కు కలగదు. సాంకేతిక విభాగం : మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ సినిమాకి చాల హెల్ప్ అయ్యింది..ముఖ్యంగా సాంగ్స్ లొకేషన్స్ ను సూపర్బ్ గా తెరకెక్కించారు. అలాగే కోన వెంకట్-గోపీమోహన్ కథలను రాయడం లో దిట్ట..శ్రీను - వీరి కాంబినేషన్ లో ఎన్నో హిట్ చిత్రాలను మనం ఇదివరకే చూసాం..కానీ ఈ చిత్ర కథ విషయం లో సరైన నాయ్యం చేయలేదనే అనిపిస్తుంది.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ చిత్రం కోసం చాలా కష్ట పడ్డాడు..ఆడియో సూపర్ హిట్ కావడం తో , విజువల్స్ పరంగా ఇంకా పెద్ద హిట్ అయ్యాయని చెప్పవచ్చు . ముఖ్యంగా ఫైట్స్, సాంగ్స్, చిరు ఎంటర్ అయినప్పుడు వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మంచి అసెట్ అని చెప్పవచ్చు. పాటల్లో కొరియోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది..ఎడిటింగ్ కూడా సినిమా కథ కు సరిగ్గా నిడివి సరిపోయింది..ఆ విషయం లో ఎం.అర్ వర్మ సక్సెస్ అయ్యాడు. ఇక దర్శకుడి గురించి చెప్పాలంటే ఒక రకంగా శ్రీను వైట్ల సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఏ సినిమా కైన మైనస్ లు ఉండడం చాల కామన్, కానీ మైనస్ లు ఉన్న సినిమా ని ప్రేక్షకుడి కి చేరుకునేల తీయడం అనేది గొప్ప విషయం..బ్రూస్ లీ లో కూడా అదే జరిగింది , కథ పాతదే అయిన తీసి విదానం లో కొత్తగా చూపించాడు. చివరిగా : చిరంజీవి ని ఆరేళ్ళ తర్వాత వెండి తెర ఫై చూడాలనుకునే వాళ్ళు , అలాగే ఏడాదిగా చరణ్ చిత్రం కోసం ఎదురు చూస్తున్న మెగా అబిమానులు బ్రూస్ లీ తో కడుపు నింపుకోవచ్చు..ఫస్ట్ హాఫ్ అంత ఎంజాయ్ చేస్తారు..సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేసరికి అసలు పెన్స్ స్టార్ట్ అవుతాయి..పాత కథ మీ ముందు కనపడుతుంది..దానికి తోడు కామెడీ తగ్గడం తో కాస్త నిరశ చెందుతారు..మొత్తంగా చెప్పాలంటే అనుకున్నంత అంచనాలు అందుకోలేకపోయింది..
--మాగల్ఫ్.కామ్ రేటింగ్:3.25/5
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







