మిస్ వరల్డ్ కెనడా పోటీల్లో తెలంగాణ అమ్మాయి
- July 03, 2017
మిస్ వరల్డ్ కెనడా పోటీల్లో తెలుగమ్మాయి
ఓ తెలుగమ్మాయి కెనడా అందాల పోటీలో రాణిస్తోంది. తెలంగాణ ఖమ్మం జిల్లాకు చెందిన కల్యాణపు శ్రావ్య 'మిస్ వరల్డ్ కెనడా' పోటీలకు ఎంపికైంది. 1996లో జన్మించిన శ్రావ్య ప్రాథమిక విద్యాభ్యాసం ఆదిలాబాద్ లోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్‌లో కొనసాగింది. ఆ సమయంలో శ్రావ్య తండ్రి రవికుమార్ ఇచ్చోడ మండల వ్యవసాయాధికారిగా పనిచేస్తుండేవారు. అనంతరం శ్రావ్యకు దాదాపు పదేళ్ల వయసు(2005)లో ఆమె తండ్రి రవికుమార్ ఉపాధి నిమిత్తం కెనడాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.
ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ అల్బెర్టాలో కెమికల్ ఇంజినీరింగ్ చదవుతోంది. థర్డ్ ఇయర్ స్టూడెంట్ అయిన శ్రావ్యకు మోడలింగ్‌పై ఎంతో ఆసక్తి ఉండేది. మూడేళ్ల కిందటే మోడలింగ్ రంగంలో అడుగుపెట్టిన శ్రావ్య.. ఇప్పటికే 'మిస్ నార్తర్న్ అల్బర్టా' కిరీటం కైవసం చేసుకుంది. ఈ జులై 16 నుంచి 23 వరకు నిర్వహించనున్న 'మిస్ వరల్డ్ కెనడా-2017' పోటీలకు ఎంపికైంది.
శ్రావ్య కచ్చితంగా విజయం సాధిస్తుందని, ఇది వరకే ఆమె సాధించిన విషయాల పట్ల ఆదిలాబాద్‌లోని ఆమె చిన్ననాటి మిత్రులు, స్కూలు యాజమాన్యంతో పాటు సొంత జిల్లా ఖమ్మం వాసులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్‌లో ఆమె పేరిట భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం గమనార్హం. శ్రావ్య తండ్రి రవికుమార్ జాతీయ మీడియాలో ఫోన్లో మాట్లాడుతూ.. ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో తన కూతురు విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు.
తాజా వార్తలు
- ట్రంప్ పిలుపునకు స్పందించిన అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు..!!
- గ్యాస్ లీకేజీల వల్ల ప్రాణాంతక ప్రమాదాలు.. అలెర్ట్ జారీ..!!
- అల్ బషాయర్ క్యామెల్ రేసింగ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 2న ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో SR300 బిలియన్లు ఖర్చు పెట్టిన టూరిస్టులు..!!
- ఈ వీకెండ్ లో అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ పూర్తిగా మూసివేత ..!!
- షార్జాలో రెస్టారెంట్ లోకి దూసుకెళ్లిన టాక్సీ..!!
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC







