బాలకృష్ణ తరపున నేను సారీ చెబుతున్నా: పూరీ జగన్నాథ్
- July 04, 2017
నారా రోహిత్, సుధీర్‌బాబు, సందీప్ కిషన్, ఆది హీరోలుగా నటించిన 'శమంతకమణి' సినిమా ప్రీ రిలీజ్ వేడుక సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ''ఇది నలుగురు స్టార్‌ల ఫిల్మ్. ఈ నలుగురిలో ఎవరు ముందు నాకు డేట్లు ఇస్తే వారితో నేను సినిమా చేస్తా. ఎన్‌సైక్లోపీడియా లాంటి రాజేంద్రప్రసాద్‌గారితో పని చేయాలనేది ఎప్పట్నించో నాలో ఉన్న కోరిక. బాలకృష్ణగారు ఈ వేడుకకు వెళ్దామని నిన్ననే నాతో చెప్పారు. ఈ రోజు షూటింగ్ ప్యాకప్ సమయంలోనూ ఫంక్షన్‌లో కలుద్దామని ఇంటికి వెళ్లారు. అయితే కొద్దిగా ఫుడ్ పాయిజన్ అవడం వల్ల రాలేకపోయారు. ఆయన తరపున నన్ను సారీ చెప్పమన్నారు. అభిమానులు అసంతృప్తి చెందవద్దు. ఆయనను మన 'పైసా వసూల్' వేడుకలో కలుద్దాం. 'శమంతకమణి' ట్రైలర్ చాలా ఎనర్జిటిక్‌గా ఉంది. డైరెక్టర్ శ్రీరామ్ సినిమాను చాలా బాగా తీశాడని అనిపిస్తోంది. ఆనందప్రసాద్ వండర్‌ఫుల్ ప్రొడ్యూసర్'' అని చెప్పారు.
నలుగురు హీరోలతో సరదాగా ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేయొచ్చనే దానికి ఈ సినిమా ఒక ఉదాహరణ అని సందీప్ కిషన్ తెలుపగా, నలుగురం మంచి పాత్రలు చేశామనీ, మణిశర్మ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారనీ నారా రోహిత్ చెప్పారు. ''ఈ సినిమా నాకు మా అమ్మను పరిచయం చేసింది. తల్లిలేని అబ్బాయి కృష్ణగా ఇందులో నటించాను'' అని సుధీర్‌బాబు అంటే నలుగురం ఎలాంటి ఇగోలకు పోకుండా పాత్రలను నమ్మి చేశామని ఆది అన్నారు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ ''నలుగురు హీరోలతో ఈ సినిమా చేసే ధైర్యాన్ని మా అమ్మ ఇచ్చారు. నలుగురూ చాలా బాగా చేశారు. రాజేంద్రప్రసాద్ వంటి లెజెండ్‌తో పనిచేసే అవకాశం లభించింది'' అని చెప్పారు. ఈ వేడుకలో నిర్మాత ఆనందప్రసాద్, నాయికలు చాందినీ చౌదరి, జెన్నీ హనీ, అనన్య సోనీ, నటి హేమ, నటులు బెనర్జీ, గుండు సుదర్శన్, గేయ రచయిత రామజోగయ్యశాస్త్రి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అన్నే రవి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







