సర్వీస్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం: కార్ల దగ్ధం
- July 04, 2017
మస్కట్: అల్ కువైర్‌లోని షన్‌ఫారి సర్వీస్ సెంటర్‌లో చెలరేగిన అగ్ని ప్రమాదం ఒక లాంబోర్గాని కారుని పూర్తిగా నాశనం చేసింది. మరో కారు ఈ అగ్ని ప్రమాదంలో స్వల్పంగా దెబ్బతింది. సర్వీస్ సెంటర్ చాలావరకు డ్యామేజ్ అయ్యింది. అయితే అ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. పిఎసిడిఎ టీమ్ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకోగానే సంఘటనా స్థలానికి చేరుకుని, మంటల్ని ఆర్పివేసింది. షాన్ఫారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పబ్లిక్ రిలేషన్స్ మరియు అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ నాజర్ హమాద్ అల్ వాహిబి మాట్లాడుతూ, ఉదయం 9.17 నిమిషాల సమయంలో అగ్ని ప్రమాదాన్ని ఓ ఉద్యోగి కనుగొన్నారని, తక్షణం పిఎసిడిఎకి ఫిర్యాదు చేశామని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో 4 లాంబోర్గానీ కార్లు ఉన్నాయి. ఒక కారు పూర్తిగా ధ్వంసం కాగా, మరొకదానికి చిన్నపాటి డ్యామేజీ మాత్రమే జరిగింది. రాయల్ ఒమన్ పోలీసులు కేసు విచారణ చేపట్టారు.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







