బ్రహ్మీ లీడ్ రోల్ లో కత్తి రెడ్డి
- July 04, 2017
స్టార్ కమెడియన్ బ్రహ్మానందం కీలక పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతుందన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం అంతగా ఫాంలో లేని బ్రహ్మీ లీడ్ రోల్లో సినిమా అంటే ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కత్తి రెడ్డి అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఎత్తితే దించడు అనేది ట్యాగ్ లైన్.
రవి వర్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో యాంకర్ రవి మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. టైటిల్‌తో పాటు బ్రహ్మీ రవిల కాంబినేషన్‌పై అంచనాలు బానే ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఏ మాత్రం ఫాంలోని లేని బ్రహ్మానందం లీడ్ యాక్టర్‌గా సినిమాను ఎంత వరకు కాపాడగలడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పోసాని కృష్ణమురళీతో నేను కిడ్నాప్ అయ్యానోచ్ సినిమా చేస్తున్న బ్రహ్మీ, లీడ్ యాక్టర్ సక్సెస్ ట్రాక్‌లోకి వస్తాడేమో చూడాలి.
తాజా వార్తలు
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్







