బర్గర్లు, పిజ్జాలతో మతిమరుపు?
- July 04, 2017
ప్రస్తుతం చాలా మంది తీసుకుంటున్న బర్గర్, పిజ్జా, ఎరుపు మాంసం కారణంగా మతిమరుపు వచ్చే అవకాశం ఉందని అమెరికా పరిశోధకులు చెబుతున్నారు. కొన్ని ఎలుకల మీద వీరు ఆరు నెలల పాటు పరిశోధన నిర్వహించారు. వీటికి ప్రతిరోజూ బర్గర్లు, పిజ్జాలతో పాటు ఎర్రమాంసంతో తయారు చేసిన ఆహారాన్ని ఇచ్చారు. ఆరు నెలల తరువాత వీటిని పరిశీలించగా, వీటి బరువులో అనూహ్యమైన మార్పులు రావడంతో పాటు వాటి కదలికలలో, రుచి వాసన కనిపెట్టడం లాంటి విషయాలలో మార్పును గమనించారు. అధిక క్యాలరీలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వలన ఎలుకల్లో చురుకుదనం నశించిదని వారు చెబుతున్నారు. ప్రస్తుతం చాలా మంది బర్గర్లు, పిజ్జాలు తినడానికే ఇష్టపడుతున్నారనీ, వీటిని తీసుకోవడం వలన ఇప్పటికిప్పుడు వచ్చే ప్రమాదం అధికబరువు ఒక్కటేననీ, అయితే దీర్ఘకాలంలో వీరిలో జ్ఞాపకశక్తి నశించే అవకాశాలు ఎక్కువ అని వారు అంటున్నారు. ఈ విషయం మీద ఇంకా పరిశోధనలు నిర్వహించాల్సి ఉందని వారు చెబుతున్నారు.
తాజా వార్తలు
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం







