తమిళనాడు చెన్నైలో 'ఐసిస్' కలకలం
- July 04, 2017
చెన్నైలో మరోసారి 'ఐసిస్' కలకలం రేగింది. నగరంలోని బర్మాబజార్కు చెందిన హరూన్ (30)ని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) రాజస్థాన్ అధికారులు మంగళవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాద సంస్థ సానుభూతిపరులకు నిధులు ఇస్తూ సహకరిస్తున్నాడన్న సమాచారం మేరకు పక్కా పథకం ప్రకారం ఏటీఎస్ అధికారులు అతడ్ని పట్టుకున్నారు. ఇదివరకే ఏటీఎస్ అదుపులో ఉన్న మహ్మద్ ఇక్బాల్, జమిల్ అహ్మద్ ఇచ్చిన సమాచారంతో స్థానికంగా మొబైల్ దుకాణం నడుపుతున్న హరూన్ను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం జయపురకు తరలించారు. గతంలో ఎనిమిది మంది తమిళనాడు యువకులు ఐసిస్లో చేరినట్లు అధికారిక లెక్కల్లో తేలింది. అలాగే ఏడాది క్రితం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన యువకుడు ఫరీద్ రహమాన్ ఐసిస్లో చేరినట్లు పోలీసుల దర్యాప్తుతో వెలుగులోకి వచ్చింది.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







