ఇజ్రాయెల్ టూర్ పూర్తిచేసుకున్న ప్రధాని మోడీ
- July 06, 2017
భారత ప్రధాని నరేంద్ర మోడీ .. మూడు రోజుల ఇజ్రాయెల్ పర్యటన ముగిసింది. చివరిరోజు కూడా ప్రధాని వెన్నంటే ఉన్నారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్. హైఫాలో మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో మరణించిన భారతీయ సైనికులకు నివాళులు అర్పించారు మోడీ. అనంతరం.. ఓల్గా బీచ్‌కు వెళ్లి. . సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే వాహనాన్ని పరిశీలించారు. నీటి సంరక్షణ, గంగా ప్రక్షాళన, నీటి నిర్వహణలో పరస్పర సహకారంపై రెండు దేశాలు ఇదివరకే ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ వాహనంలో మోడిని ఎక్కించుకుని.. బెంజమిన్ స్వయంగా డ్రైవ్ చేస్తూ బీచ్‌లో తిప్పారు. ఆ తర్వాత ఓ టెక్నాలజీ ఎగ్జిబిషన్‌ను సందర్శించారు మోడీ. అక్కడి కొత్త టెక్నాలజీల గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. మూడు రోజుల ఇజ్రాయెల్ పర్యటన ముగించుకున్న ప్రధాని.. అక్కడి నుంచి జర్మనీలోని హాంబర్గ్‌కు వెళ్లారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







