ఇజ్రాయెల్ టూర్‌ పూర్తిచేసుకున్న ప్రధాని మోడీ

- July 06, 2017 , by Maagulf
ఇజ్రాయెల్ టూర్‌ పూర్తిచేసుకున్న ప్రధాని మోడీ

భారత ప్రధాని నరేంద్ర మోడీ .. మూడు రోజుల ఇజ్రాయెల్ పర్యటన ముగిసింది. చివరిరోజు కూడా ప్రధాని వెన్నంటే ఉన్నారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్. హైఫాలో మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో మరణించిన భారతీయ సైనికులకు నివాళులు అర్పించారు మోడీ. అనంతరం.. ఓల్గా బీచ్‌కు వెళ్లి. . సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే వాహనాన్ని పరిశీలించారు. నీటి సంరక్షణ, గంగా ప్రక్షాళన, నీటి నిర్వహణలో పరస్పర సహకారంపై రెండు దేశాలు ఇదివరకే ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ వాహనంలో మోడిని ఎక్కించుకుని.. బెంజమిన్‌ స్వయంగా డ్రైవ్‌ చేస్తూ బీచ్‌లో తిప్పారు. ఆ తర్వాత ఓ టెక్నాలజీ ఎగ్జిబిషన్‌ను సందర్శించారు మోడీ. అక్కడి కొత్త టెక్నాలజీల గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. మూడు రోజుల ఇజ్రాయెల్ పర్యటన ముగించుకున్న ప్రధాని.. అక్కడి నుంచి జర్మనీలోని హాంబర్గ్‌కు వెళ్లారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com