కార్మికుడి మృతి: యూఏఈ కాంట్రాక్టర్‌పై అభియోగాలు
- July 07, 2017
రస్ అల్ ఖైమా: రస్ అల్ ఖైమా మిస్‌డెమీనర్ కోర్టులో అరబ్ కాంట్రాక్టర్ ఒకరిపై అభియోగాలు మోపబడ్డాయి. కార్మికుడి మృతికి సంబంధించిన కేసు ఇది. వర్క్ సైట్‌లో కార్మికుడు మృతి చెందగా, దానికి బాధ్యత కాంట్రాక్టర్‌దేనని అభియోగాలున్నాయి. తగినన్ని భద్రతా చర్యలు వర్క్ సైట్‌లో చేపట్టకపోవడమే కార్మికుడి మృతికి కారణమని కేసు నమోదయ్యింది. బ్లూ కాలర్ కార్మికుడు, అల్ ఖైమాకి చెందిన ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. కంపెనీ యజమాని చెప్పిన మేరకు పని చేస్తూ మృతి చెందాడు. అయితే, అనుకోకుండా జరిగిన ప్రమాదానికి తనను బాధ్యుడిని చేయడం తగదని అభియోగాలు ఎదుర్కొంటున్న కాంట్రాక్టర్ న్యాయస్థానం యెదుట తన వాదనలు విన్పించారు. వర్క్ సైట్‌లో కార్కికుల భద్రత కాంట్రాక్టర్‌దేనని న్యాయస్థానం వెల్లడించింది. తదుపరి విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది.
తాజా వార్తలు
- భారత్–షార్జా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు డ్రైవర్లకు కీలక సూచనలు..!!
- సౌదీ ప్రజలకు భారత కాన్సుల్ జనరల్ శుభాకాంక్షలు..!!
- బంధువుల మధ్య వివాహాలతో జన్యు వ్యాధుల ముప్పు.. డాక్టర్ల హెచ్చరికలు..!!
- ఓపెన్ ప్రిజన్స్ ప్రోగ్రామ్.. ఖైదీల కళల్లో శాంతి సందేశాలు..!!
- యూఎన్ఓలో ఖతార్ అమిర్ ప్రసంగానికి దౌత్యవేత్తల ప్రశంసలు..!!
- ముత్రా కేబుల్ కార్ భద్రతా ఏర్పాట్లపై సమీక్ష..!!
- ఇంట్లోకి చొరబడి కాల్పులు, 11 మంది మృతి
- ఆసియా-పసిఫిక్‌లో ఏరో ఇంజిన్ సేవల విస్తరణకు జీఎంఆర్ ఏరో టెక్నిక్–స్టాండర్డ్ ఏరో భాగస్వామ్యం
- యూపీఐ ఛార్జీలపై NPCI కీలక ప్రకటన







