'ETCA' వారి ఆధ్వర్యంలో ధూమ్ ధామ్ గా జరిగిన బతుకమ్మ మరియు దసరా సంబరాలు
- October 17, 2015
ఎమిరేట్స్ తెలంగాణా కల్చరల్ అసోసియేషన్ (ETCA ) ఆధ్వర్యంలో తేది 16 ఆక్టోబర్ 2015 శుక్రవారం రోజున స్కయిలైన్ యూనివర్సిటీ కాలేజీ, యూనివర్సిటీ సిటీ , షార్జా - యు. ఎ . ఇ లో సాయంత్రం 3 గంటల నుండి రాత్రి 10.30 గం,, వరకు భారీ జన సందోహం నడుమ ఘనంగా బతుకమ్మ & దసరా సంబరాలు నిర్వహించారు .
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ శాసన సభ్యులు శ్రీమతి రేఖ శ్యామ్ నాయక్, గాయకులూ మాట్ల తిరుపతి , అకునూరి దేవన్న, సామాజిక సేవకులు, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, తోట రామ్ కుమార్, ఆచార్య భూమి రెడ్డి తదితరులు హజరయ్యరు. ఈ సందర్బముగా ఖానాపూర్ శాసన సభ్యులు రేఖ శ్యాం నాయక్ మాట్లాడుతూ గల్ఫ్ గడ్డపై తెలంగాణ సంస్కృతికి నిలువుతద్దమైన బతుకమ్మ సంభారాలను బారిగా నిర్వహించడం చాలా సంతోషకరం అన్నారు. తనకు తెలంగాణ గడ్డపై బతుకమ్మ ఆడుతున్న అనుభూతి కలిగింది అన్నారు. ఈ ఉత్సవాల ద్వారా ఇక్కడి తెలంగాణ ప్రజలను కలిసేలా కృషి చేసిన ETCA బృందానికి కృతజ్ఞతలు తెలియజెసారు. గల్ఫ్ బాదితుల సమస్యలను, ETCA చేపడుతున్న సేవా కార్యక్రమాలను సియం కేసిర్ దృష్టికి తిసుకేలతానని హామీ ఇచ్చారు అనంతరం ETCA వ్యవస్థాపక అధ్యక్షులు పిచర కిరణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి పరిరక్షణ , తెలంగాణ ప్రజల సంక్షేమమే తమ సంఘం లక్ష్యం అన్నారు. గల్ఫ్ గడ్డపై వున్నా తెలంగాణ ప్రజలంతా బారిగా తరలివచ్చి విజయవంతం చేసినదుకు కృతజ్ఞతలు తెలిపరు. ప్రపంచ వ్యాప్తం గా వున్నా తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపరు.
సంఘం సభ్యులందరి సహకారంతో కార్యక్రమం దిగ్విజయమైందని దీనికి నిదర్శనమే 6 వేల పై చిలుకు ప్రజలు తరలిరావడం అని అన్నారు.
తెలంగాణ సంస్కృతిని కాపాడుతూ ఆపదలో వున్నా అందరిని ఆదుకొంటూ తమ సంఘం ముందుకు సాగుతున్దన్నారు. భావిషతులో కుడా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పరు.
ఈ ఏడాది మన దేశానికి చెందిన ఆంధ్రప్రదేశ్ ,కేరళ , తమిళనాడు , కర్ణాటక ,గుజరాత్ రాష్ట్రాల ప్రజలతో పాటు సమీప దేశాలైన ఒమన్ , బహారెన్, కత్తర్ దేశాల నుండి తెలంగాణ ప్రజలు హాజరవడం చాల సంతోషాన్ని ఇచ్చిందని నిర్వాహుకులు పేర్కొన్నారు .
అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల విజేతలకు బహుమతులు ప్రధానం చేసారు . ఈ కార్యక్రమంలో సంఘ ఉపద్యాక్ష్యులు మామిడి శ్రీనివాస్ రెడ్డి , మంచుకొండ వెంకటేశ్వరులు , రాధరపు సత్యం , బలరాం రెడ్డి , తిరుపతి సిరిమల్లె , ప్రవీణ్ కుమార్ , అరవింద్ యాదవ్ , శ్రీనివాస్, వెంకటేశ్వర్ రావు , శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన 'ETCA' వారికి మాగల్ఫ్.కామ్ తరుపున ప్రత్యేక అభినందనలు.
--సి.శ్రీ(దుబాయ్)










తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







