పెరూదేశంలో బస్సు ప్రమాదం: 9మంది మృతి

- July 10, 2017 , by Maagulf
పెరూదేశంలో బస్సు ప్రమాదం: 9మంది మృతి

పెరూ దేశంలో జరిగిన బస్సు ప్రమాదంలో తొమ్మిది మంది మృతిచెందారు. డబుల్‌ డెక్కర్‌ టూరిస్టు బస్సు అదుపుతప్పి కొండపై నుంచి పడడంతో తొమ్మిదిమంది ప్రయాణికులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 25 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో కెనడియన్‌, చిలీ దేశస్తుడు కూడా ఉన్నారని రక్షణ సిబ్బంది తెలిపారు.
 ఈ సంఘటన లిమాలో అధ్యక్షుడి భవనానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఆదివారం రాత్రి జరిగిందని పెరూ ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. నగర అందాలను చూసేందుకు స్థానిక బస్సు శాన్‌ క్రిస్టోబల్‌ కొండపై వెళ్తున్నపుడు ఈ ప్రమాదం సంభవించిందన్నారు. ఆ సమయంలో బస్సు అతివేగంతో వెళ్తున్నట్లు తెలుస్తోందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com