ఇండియన్ వర్కర్స్ కోసం కొత్త సపోర్ట్ సెంటర్
- July 11, 2017
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అతి త్వరలో షార్జాలోని భారత కార్మికుల కోసం వెల్‌ఫేర్ సెంటర్‌ని ఏర్పాటు చేయనున్నట్లు యూఏఈలో ఇండియన్ అంబాసిడర్ నవ్‌దీప్ సింగ్ సూరి చెప్పారు. షార్జాలో ప్రారంభించే ఇండియన్ వర్కర్స్ రిసోర్స్ సెంటర్ (ఐడబ్ల్యుఆర్‌సి) రెండో కేంద్రం. మొదటి ఐడబ్ల్యుఆర్‌సి, దుబాయ్‌లో 2010లో ప్రారంభించారు. ప్రస్తుతం 2.6 మిలియన్ భారత వలసదారులకు యూఏఈలో ఈ కేంద్రం సేవలు అందిస్తోంది. ప్రభుత్వం నుంచి అప్రూవల్స్ వచ్చాయనీ, కొత్త సెంటర్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయని నవ్‌దీప్ సింగ్ సూరి చెప్పారు. ప్రస్తుతానికి కొత్త సెంటర్ తాలూకు లొకేషన్ ఖచ్చితంగా చెప్పలేమని, షార్జాతోపాటు సమీప ప్రాంతాల్లో ఉన్నవారికి ఈ కేంద్రం వీలుగా ఉంటుందని మాత్రం చెప్పగలమని ఆయన తెలిపారు. దుబాయ్ సెంటర్ అందిస్తున్న సేవలన్నీ షార్జా సెంటర్‌లో కల్పిస్తామని వివరించారాయన. 2017 తొలి ఆరు నెలల్లో దుబాయ్ సెంటర్ 11,700 కాల్స్ అందుకుందనీ, 640 మంది సందర్శించారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఐడబ్ల్యుఆర్‌సి 589 లీగల్ కౌన్సిలింగ్ సెషన్స్‌ని, 31 పర్సనల్ కౌన్సిలింగ్ సెషన్స్‌ని, 33 ఫైనాన్షియల్ కౌన్సిలింగ్ సెషన్స్‌నీ నిర్వహించింది.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







