సన్నబడాలనుకునేవారు.. డ్రైఫ్రూట్స్‌తో పాటు బ్రౌన్ రైస్ తీసుకోండి..

- July 14, 2017 , by Maagulf
సన్నబడాలనుకునేవారు.. డ్రైఫ్రూట్స్‌తో పాటు బ్రౌన్ రైస్ తీసుకోండి..

సన్నబడాలనుకునేవారు తీసుకునే పదార్థాల్లో అసలు ఫాట్ లేకుండా చూసుకోవాలి. అయితే శరీర వ్యవస్థలూ, హార్మోన్లు సరిగా పనిచేయాలంటే డైటరీ ఫ్యాట్‌ కూడా కొంతమేరకే తీసుకోవాలంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. లేకుంటే నెలసరికి సంబంధించిన సమస్యలు ఎదురుకావచ్చు. అందుకే మేలుచేసే కొవ్వు పదార్థాలను ఎంచుకునే ప్రయత్నం చేయాలి. అంటే బాదం, వాల్‌నట్లూ, పిస్తా వంటి డ్రైఫ్రూట్లూ, బ్రౌన్ రైస్ తీసుకోవాలి. 
 పొద్దున్నే అల్పాహారం తప్పకుండా తీసుకోవాలి. మధ్యాహ్నం భోజనం తక్కువ తీసుకున్నవారవుతారు. గుడ్లూ, పప్పుధాన్యాలూ, అవిసెగింజలు, చేపలు వంటివాటితో పాటు కూరగాయలూ, ఆకుకూరలూ వంటివి డైట్‌లో చేర్చుకోవాలి. 
 బరువు పెరగడానికి మనం తీసుకునే పిండిపదార్థాలు గ్లూకోజ్‌గా మారడమే. ఆ పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే సాధారణ బియ్యానికి బదులు ముతక బియ్యం, రాగులూ, కొర్రలూ, జొన్నల వంటివాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. వాటికి జతగా కూరగాయలూ, ఆకుకూరల్ని ఎంచుకుంటే పోషకాలు అందుతాయి. శరీర జీవక్రియా రేటు మెరుగుపడుతుంది. ఏవి పడితే అవి కాకుండా మొలకలూ, పండ్లూ, డ్రైఫ్రూట్స్‌, బ్రౌన్‌బ్రెడ్‌ శాండ్‌విచ్‌ వంటివి ఎంచుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com