దుబాయ్ రిటెయిల్ స్టోర్లలో ఎన్ఓఎల్తో చెల్లింపులు
- July 17, 2017
దుబాయ్: ఎన్‌ఓఎల్ కార్డు ద్వారా దుబాయ్ వ్యాప్తంగా వెయ్యికి పైగా ఔట్‌లెట్స్‌లో చెల్లింపులు చేయవచ్చునని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వెల్లడించింది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పేమెంట్ సొల్యూషన్ కోసం ఎన్‌ఓఎల్ కార్డ్ ఉపయోగంలో ఉంది ఇప్పటిదాకా. పలు మెట్రో మరియు పెట్రోల్ స్టేషన్లలో ఏప్రిల్ నుంచి ఈ కార్డు చెల్లింపుల కోసం అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు తాజాగా ప్రముఖ ఔట్‌లెట్స్‌లోనూ ఈ కార్డ్ చెల్లింపులకు ఉపయోగపడుతుంది. ఈ ఏడాది చివరి నాటికి 5 వేల స్టోర్స్‌లో ఎన్‌ఓఎల్ కార్డులు ఉపయోగించుకునేందుకు వీలుంటుందని ఆర్టిఎ - కార్పొరేట్ టెక్నాలజీ సపోర్ట్ సర్వీసెస్ సెక్టార్ సిఇఓ అబ్దుల్లా అల్ మదాని చెప్పారు. బ్లూ ఎన్‌ఓఎల్ కార్డుతో 5,000 దిర్హామ్‌ల వరకు కొనుగోళ్ళు చేయవచ్చు. సిల్వర్ మరియు గోల్డ్ ఎన్‌ఓఎల్ కార్డులతో 1,000 దిర్హామ్‌ల విలువైన కొనుగోళ్ళు చేయడానికి వీలుంది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్‌లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







