24న సిట్ విచారణకు హీరో రవితేజ
- July 17, 2017
సినీ పరిశ్రమకు సంబంధించి డ్రగ్స్ కేసు విచారణ కీలక దశకు చేరుకుంటున్నది. డ్రగ్స్ కేసుతో సంబంధమున్న సినీ ప్రముఖులు ఒక్కొక్కరే సిట్ ముందుకు రాబోతున్నారు. సిట్ అడుగబోయే కఠినమైన ప్రశ్నలకు జవాబిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. డ్రగ్స్ కేసుతో సంబంధం ఉండి.. డ్రగ్స్ తీసుకుంటున్న పలువురు ప్రముఖులకు సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఇప్పటికే నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులు ఈ నెల 19 నుంచి సిట్ విచారణకు హాజరుకానున్నారు.
ఈ నెల 19న ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, 20న హీరోయిన్ ఛార్మీ, 21న ప్రత్యేక గీతాల నటి మొమైత్ ఖాన్, 22న నటుడు సుబ్బరాజు, 23న ప్రముఖ కెమెరామ్యాన్ శ్యాం కే నాయుడు సిట్ ఎదుట హాజరుకాబోతున్నారు. ఇక ప్రముఖ హీరో రవితేజ ఈ నెల 24న సిట్‌ను ఫేస్ చేయబోతున్నాడు. ఈ నెల 25న ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను, 26న హీరో నవదీప్, 27న హీరో తరుణ్, 28న యువ హీరోలు తనీష్, నందులను సిట్ విచారించనుంది. పేరుమోసిన డ్రగ్స్ సరఫరాదారుడు కెల్విన్ కాల్‌లిస్ట్ ఆధారంగా వీరికి తెలంగాణ ఎక్సైజ్‌శాఖ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు









