తమిళ్ హీరో శరత్ కుమార్ కు రూ. 2 లక్షల ఫైన్
- July 18, 2017
నటుడు శరత్‌కుమార్‌కి కష్టాలు రెట్టింపయ్యాయి. తనఖాపెట్టిన ఆస్తిని విక్రయించడానికి యత్నించిన వ్యవహారంలో ఆయనకు మద్రాస్ హైకోర్టు రూ.2 లక్షల జరిమానా విధించింది. తమపై దాఖలైన పిటిషన్‌ను తోసిపుచ్చాలంటూ శరత్‌కుమార్ వేసిన పిటిషన్‌ను విచారణకు అనుమతించలేదు న్యాయస్థానం.
శరత్‌కుమార్, ఆయన వైఫ్ రాధిక భాగస్వాములుగావున్న మ్యాజిక్ ఫ్రేమ్స్ సంస్థ 'ఇదు ఎన్న మాయం' అనే ఫిల్మ్‌ని తెరకెక్కించింది. దీని నిర్మాణం కోసం.. రాడియన్స్ సంస్థ నుంచి 2014లో శరత్‌కుమార్ రూ.1.50 కోట్ల అప్పు తీసుకున్నాడు. ఈ అప్పుని మరుసటి ఏడాది మార్చిలోపు చెల్లిస్తానని, లేనిపక్షంలో టీవీ హక్కులు, తర్వాత నిర్మించబోయే ఫిల్మ్ హక్కులను రాడియన్స్ సంస్థకు అందించనున్నట్టు హామీ ఇచ్చాడు. ఆ తర్వాత రూ. కోటి రుణం అదనంగా తీసుకుని పూచీగా ఆస్తులను తనఖా పెట్టాడు. ఐతే, ఒప్పందాన్ని అతిక్రమించి సినిమా విడుదల చేశాడట ఈ నటుడు. తనఖా పెట్టిన ఆస్తులను విక్రయించడానికి యత్నించాడని, అలాగే తమ నుంచి తీసుకున్న రెండున్నర కోట్లకు వడ్డీ చెల్లించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో రాడియన్స్ సంస్థ పిటిషన్ వేసింది.
దీనిపై స్పందించిన న్యాయస్థానం, ఆగస్ట్ 15లోపు రూ.2 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!







