తెలంగాణ వాసికి బహ్రెయిన్ ఎన్నారై టిఆర్ఎస్ సెల్ ఆపన్న హస్తం

- July 19, 2017 , by Maagulf

బహ్రెయిన్: బహ్రెయిన్ ఎన్నారై టిఆర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో పక్షవాతంతో బాధపడుతున్న బాధితునికి ఆర్థిక సహాయం అందించి ఇండియాకు పంపియడం జరిగింది. 

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని రామన్నపేట గ్రామానికి చెందిన "సాయన్న పథన్ని" 48 పాస్పోర్ట్ నెంబర్ K4698324, ఎన్నో ఆశలతో పొట్ట చేతిన పట్టుకుని గత ఆరు నెలల క్రితం బహరేన్ కు వచ్చి ఒక ప్రవేట్ కంపెనీలో పనిచేస్తు గత రెండు వారాల క్రితం డ్యూటీలో పనిచేస్తుండగా కళ్లు తిరిగి స్పర్శ కోల్పవడంతో కంపెనీ యాజమాన్యం సల్మానియా ఆస్పత్రికి తరలించాగా, ఆస్పత్రిలో చికిత్స  పొందుతున విషయం తెలుసుకున్న బహరేన్ ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బృందం వెంటనే వెళ్లి అతని పరామర్శించి డాక్టర్స్ తో మాట్లాడగా, పక్షవాతం రావడం వల్ల ఎడమ కాలు చేయి పనిచేయడం లేదు అని చెప్పాగా. తీవ్ర బాధతో మాట్లాడిన సాయన్న స్వగ్రామానికి పంపించడి అంటూ తన గోడు విన్నవించుకోగా, వారి కంపెనీ అధికారులతో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్  ప్రెసిడెంట్ బోలిశెట్టి వెంకటేష్ లు అధికారులతో మాట్లాడగా వెంటనే స్పందించి అతనితో పాట్ మరో వ్యక్తి కి టికెట్ ఇచ్చి ఇండియా కు పంపియడం జరిగింది. అనంతరం ఎన్నారై టిఆర్ఎస్ సెల్ బహరేన్ ఆధ్వర్యంలో అతని మందుల ఖర్చులకు ప్రస్తుతం 10.000/- వేల రూపాయల ఆర్థిక సహాయంనీ అందించి. తేదీ18.07.17 మధ్యాహ్నం గల్ఫ్ ఎయిర్ GF276 ద్వారా బహరేన్ నుండి 02:25గం లకు బయలు దేరి రాత్రి 09:05గం లకు శంషాబాద్‌ చేరగా, ఎయిర్‌పోర్ట్‌ నుండి స్వగ్రామానికి రవాణా చేయడానికి టీఆర్ఎస్ నిజామాబాదు ఎంపీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కవిత కల్వకుంట్ల గారి ఆధ్వర్యంలో జాగృతి రాష్ట ప్రధాన కార్యదర్శి నవీన్‌ ఆచారి మరియు బాబు రావు ఇందుకు ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పించారు. సాయన్న తొందరగా కోలుకోవాలని ఆ భగవంతునీ కోరుతు ఎన్నారై టీఆరెస్ సెల్ బహరేన్ ప్రెసిడెంట్ సతీష్ కుమార్ రాధారపు, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బోలిశెట్టి, జనరల్ సెక్రెటరీలు లింబాద్రి, రవి, సెక్రెటరీలు ప్రశాంత్, రవిపటేల్, సుమన్, జాయంట్ సెక్రెటరీలు రాజేంధార్, గంగాధర్, సంజీవ్, విజయ్, ఎగ్సిక్యుటివ్ మెంబర్స్ సుధాకర్, దేవన్న, రాజేష్, రాజు, నర్సయ్య, తదితరులు సభ్యులు పాల్గొన్నారు.

----యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com