యూఏఈ జాబ్ అలర్ట్: 2,000 వేకెన్సీలు
- July 19, 2017
దుబాయ్: యూఏఈలో ఉద్యోగార్థుల కోసం 2,000కు పైగా వేకెన్సీలు ఎదురుచూస్తున్నాయి. దుబాయ్, అబుదాబీ, షార్జా, అజ్మన్, ఫుజైరా, రస్ అల్ ఖైమా తదితర ప్రాంతాల్లోని కంపెనీలు కొత్త ఉద్యోగుల్ని నియమించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. డ్రైవర్ల నుంచి అకౌంటెంట్ల దాకా అలాగే ఆఫీస్ అసిస్టెంట్లు, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్ వంటి ఉద్యోగాల్లో నియమకాలు జరుగుతున్నాయి. బుధవారం 2,200 ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటనలు వెలువడ్డాయి. హోటల్స్, క్లినిక్స్, రిటైల్ స్టోర్స్, ఫ్యాక్టరీస్, బ్యూటీ సెలూన్స్ వంటివాటిల్లో ఉద్యోగాలు ఔత్సాహికుల కోసం ఎదురుచూస్తున్నాయి. కన్స్ట్రక్షన్ మరియు ఇంజనీరింగ్ ఇండస్ట్రీలో అత్యధికంగా 402 ఖాళీలున్నాయి. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో ఉద్యోగాల ప్రకటనల్లో కొంత తగ్గుదల కన్పించింది. అది సుమారుగా 47 శాతం వరకూ ఉందని అంచనా. అయితే తగ్గుదల ఉన్నప్పటికీ కూడా ఉద్యోగావకాశాలకు అయితే లోటు లేదని ఆ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్‌క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్‌లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్‌లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









