హైదరాబాద్ లో 30న డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ర్యాలీ
- July 19, 2017
కళామందిర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు వద్ద ఈ నెల 30న డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించనున్నట్టు కళామందిర్ కల్యాణ్ తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఎక్సైజ్ ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున సబర్వాల్‌తో కలిసి ఆయన బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కల్యాణ్ మాట్లాడుతూ డ్రగ్స్ సంస్కృతి పాఠశాలలకు కూడా పాకడం బాధాకరమని అన్నారు. ఎంతో భవిష్యత ఉన్న విద్యార్థులను, యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. తమ వంతుగా డ్రగ్స్ గురించి అందరికి అవగాహన కలిగించేందుకు కృషి చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే స్కూల్, కళాశాల విద్యార్థులతో కలిసి నిర్వహించే ఈ ర్యాలీకి అకున్ సబర్వాల్ కూడా హాజరుకానున్నట్లు చెప్పారు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎదురయ్యే మానసిక, ఆరోగ్య ఇబ్బందులను తెలియచేస్తూ బుక్‌లెట్ కూడా విడుదల చేయనున్నట్టు తెలిపారు. హోప్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 30న ర్యాలీకి నగరవాసులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కల్యాణ్ కోరారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత
- కువైట్‌లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్‌లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్‌లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







