కార్ ట్రాన్స్పోర్ట్ కంపెనీలకు ఖరీఫ్ ఊతం
- July 20, 2017
మస్కట్: ఖరీఫ్ సీజన్ ఫుల్ స్వింగ్‌లో ఉండటంతో మస్కట్ మరియు సలాలా మధ్య ఆటో క్యారియర్స్కి డిమాండ్ పెరిగింది. ప్రమాదాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఎక్కువమంది ట్రాన్స్పోర్ట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణాలు చాలావరకు తగ్గాయని అల్ అవ్వాన్ ట్రాన్స్పోర్ట్ అధికారి ఒకరు చెప్పారు. ఫ్యూయల్ ధరల పెరుగుదల కూడా వాహనదారులు, సొంత వాహనాల్ని పక్కన పెట్టి ట్రాన్స్పోర్ట్ వాహనాలపై దృష్టిపెట్డడానికి కారణమని ఆయన వివరించారు. ఇక్కడ రిస్క్ అనేది ముఖ్యమైన అంశమనీ, ఆ రిస్క్ చేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదని చెబుతూ, సేఫ్టీకి ప్రాధాన్యమిచ్చేవారు ఎక్కువవుతున్నట్లు తెలియజేశారు. మస్కట్ నుంచి సలాలా వచ్చి వెళ్ళేందుకు సెలూన్ కార్లో 85 ఒమన్ రియాల్స్ ఖర్చవుతుండగా, ఎస్‌యూవీకి 100 ఒమన్ రియాల్స్ ఖర్చవుతోంది. సలాలా నుంచి మస్కట్ కంటే మస్కట్ నుంచి సలాలాకి ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. హాలీడే మేకర్స్‌తోపాటు కంపెనీల నుంచి కూడా తమకు బిజినెస్ ఎక్కువగా ఉంటోందని ట్రాన్స్పోర్ట్ కంపెనీలు పేర్కొంటున్నాయి.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









