కాల్ సెంటర్ స్కాంలో మన భారతీయులు
- July 20, 2017
అమెరికాలో కాల్ సెంటర్ స్కాంలో ఓ భారతీయుడు, భారత సంతతికి చెందిన మరో వ్యక్తి తమ నేరాన్ని అంగీకరించారు. గత ఏప్రిల్, జూన్‌లో ఇదే స్కాంలో భారత్‌కు చెందిన పలువురిపై విచారణ జరగగా తాజాగా మోంటూ బారోథ్, నీలేశ్ పాండ్యాలు మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఒప్పుకున్నారు.
యూఎస్ ఫెడరల్ బ్యూరో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు గుజరాత్‌లోని అహ్మదాబాద్ కేంద్రంగా ఓ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. దీనిలో పనిచేసే టెలీ కాలర్లు తాము అమెరికా రెవెన్యూ, ఇమిగ్రేషన్, పౌర సేవల అధికారులుగా పరిచయం చేసుకుంటూ బాధితులకు కాల్స్ చేసి అడిగిన డబ్బులు ఇవ్వకపోతే అరెస్టు, దేశ బహిష్కరణ, తదితర శిక్షలు విధిస్తామని బెదిరించారు. దీంతో బాధితులు వివిధ రూపాల్లో డబ్బులు పంపగా నిందితులు వాటిని వివిధ మార్గాల్లో భారత బ్యాంకులకు తరలించారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







