అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ...దేశం దాటినా మరణం తప్పదని బెదిరింపులు
- July 21, 2017
' చుట్టమై వెళ్ళబోతే ...దయ్యమై పీక్కుతిందట ' అనే సామెత మాదిరిగా తయారైంది ఓ ప్రవాస భారతీయుని పరిస్థితి. ఓ బహ్రెయిన్ మహిళపై అత్యాచారం జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ వ్యక్తికి ఇపుడు బహ్రెయిన్ మరియు భారతదేశం నుండి మరణం తప్పదని బెదిరింపులు అధికమవడంతో ఇప్పుడు ఆ వ్యక్తి చట్టపరమైన సహాయం కోసం న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నాడు. మాజీ బహ్రెయిన్ నివాసి భారత జాతీయుడు గోపాల్ తనపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు అక్కడ బహ్రెయిన్ మహిళ ఆరోపణలు చేయడంతో భారత దేశంలో ఉంటున్న గోపాల్ గందరగోళంలో చిక్కుకున్నాడు. బహ్రెయిన్ లో ఉన్న కాలంలో ఆ మహిళతో శృంగార సంబంధాన్ని పంచుకున్న నేపధ్యం ఉండటం..ఉద్యోగం సైతం వెతికిపెట్టి బహ్రెయిన్లో ఆమెను స్థిరపర్చిన ప్రేమాయణం వెలగబెట్టిన తీరు క్లుప్తంగా గతంలో జరిగింది. ప్రస్తుతం భారత్ లో ఉన్న గోపాల్ కు వ్యతిరేకంగా ఆ మహిళ బహ్రెయిన్లో గోపాల్ ఉన్నప్పుడు తనకు మత్తుపదార్థాలు ఇచ్చి తనపై అత్యాచారం జరిపినట్లు ఇటీవల ఆరోపించింది. గోపాల్ ఈ ఆరోపణలను ఖండించాడు ఆమె తనపై చేసిన ఆరోపణలను విని ఆశ్చర్యపోయాడని చెప్పాడు. ఈ సంఘటన గూర్చి పేస్ బుక్ లో ఓ సామాజిక కార్యకర్త తాను బహ్రెయిన్ మహిళను మోసం చేసినట్లు అందుకు సంబంధించి ఒక వీడియోను పోస్ట్ చేయడంపై గోపాల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసాడు. తన పూర్తి పేరు, ఫోటో మరియు తానూ ఉండే ప్రాంతం సమాచారంతో పాటు ఆ అత్యాచారానికి , డ్రగ్స్ సరఫరా చేసినందుకు గోపాల్ కు మరణశిక్ష తప్పదనే పేస్ బుక్ పోస్ట్ అంతటా ప్రాచుర్యం పొందటంతో తానూ న్యాయస్థానాన్ని ఆశ్రయస్తున్నట్లు ప్రవాస భారతీయుడు గోపాల్ తెలిపాడు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







