విల్లాలో అగ్ని ప్రమాదం: మెయిడ్ మృతి
- July 21, 2017
ఓ ఎలుక, గ్యాస్ సిలిండర్‌కి ఉన్న వైర్‌ని కొరికెయ్యడంతో గ్యాస్ లీక్ అయ్యి, మంటలు చెలరేగగా, ఆసియాకి చెందిన 32 ఏళ్ళ మెయిడ్ మృతి చెందింది. గ్యాస్ లీక్ అయిన వాసన పసిగట్టిన యజమాని, స్టవ్‌ని వెలిగించవద్దంటూ మెయిడ్‌ని హెచ్చరించినా, ఆమెకు అర్థం కాకపోవడంతో ఆమె కిచెన్‌లోకి వెళ్ళగానే ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ లీక్ వల్ల సంభవించిన పేలుడు ధాటికి గోడ ధ్వంసమయ్యింది. తీవ్ర గాయాలతో మెయిడ్ అక్కడికక్కడే చనిపోయింది. ఘటన గురించిన సమాచారం అందుకోగానే సివిల్ డిఫెన్స్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుంది. ఎలుకల కారణంగా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయనీ, అందుకే ఎలుకలతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సివిల్ డిఫెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు గతంలోనూ దుబాయ్‌లో చోటు చేసుకున్నాయి.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







