99 మంది బహ్రెయినీ ఉద్యోగుల్ని తొలగించిన కన్స్ట్రక్షన్ కంపెనీ
- July 22, 2017
జిపి జచారియాడెస్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ కాంట్రాక్టర్స్ (జిపిజెడ్) సంస్థ 99 మంది బహ్రెయినీ ఉద్యోగుల్ని తొలగించింది. పెండింగ్ జీతాల కోసం ఉద్యోగులు గత నెలలో సనాద్లో ఆందోళన చేయడంతో ఈ సంస్థ వార్తల్లోకెక్కింది. అయితే ఆర్థిక ఇబ్బందులతో సంస్థ సతమతవుతోందని, కాంట్రాక్టర్లకు 30 మిలియన్ బహ్రెయినీ దినార్స్ ఈ సంస్థ చెల్లించాల్సి ఉందని లేబర్ ఎఫైర్స్ - లేబర్ మినిస్ట్రీ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ డాక్టర్ మొహమ్మద్ అలి అల్ అన్సారి ఈ సంఘటనపై స్పందిస్తూ వెల్లడించారు. మినిస్ట్రీస్ 2 మిలియన్ బహ్రెయినీ దినార్స్ గనుక వివిధ ప్రాజెక్టుల కోసం విడుదల చేస్తే, సంస్థ, తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించగలుగుతుందని ఆయన చెప్పారు. సంస్థలో సుమారుగా 1000 మంది వలసదారులైన కార్మికులు, 190 మంది బహ్రెయినీ కార్మికులు ఉన్నారు. సంస్థకు చెందిన ఉద్యోగుల్ని ఇతర సంస్థలకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం







