ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ సీజ్
- July 22, 2017
ఇందు గలదు.. అందు లేదు అన్న సందేహం వద్దు అన్నట్లు తయారైంది డ్రగ్స్ పరిస్థితి. దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల వాడకం విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో... సరఫరా కూడా అదే స్థాయిలో ఊపందుకుంటోంది. తాజాగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులోని ఓ విమానంలో డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. చెన్నై నుంచి వచ్చిన విమానంలోని ఫుడ్ ట్రాలీలో ఓ సీల్డ్ ప్యాకెట్‌ను సిబ్బంది గమనించారు. దాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ సిబ్బంది.. అందులో మాదక ద్రవ్యాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
ఎయిర్‌పోర్ట్‌లో ఎంతో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. కస్టమ్స్ కళ్లను దాటుకుని బయట నుంచి డ్రగ్స్ రావడం దాదాపు అసాధ్యం. అలాంటిది విమానంలోకి మత్తు పదార్థాలు వచ్చాయంటే.. అందులో కచ్చితంగా సిబ్బంది హస్తం ఉంటుంది. ఇదే కోణంలో దర్యాప్తు చేస్తున్న అధికారులు విమానం సిబ్బంది వివరాలపై ఆరా తీస్తున్నారు. దాదాపు 2 కిలోల బరువున్న ప్యాకెట్లో ఉన్నది మార్ఫిన్‌గా భావిస్తున్నారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత
- కువైట్‌లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్‌లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్‌లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







