ఆర్.ఎఫ్.సి లో బాలకృష్ణ, నయనతారతో...
- July 22, 2017
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించనున్న 102వ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున విషయం తెలిసిందే. ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ 3 నుండి రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభం కానుంది.
బాలయ్య సరసన నయనతార కథానాయికగా నటించనుండగా.. ప్రకాష్ రాజ్, జగపతిబాబు, మురళీమోహన్, బ్రహ్మానందం ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. "సెన్సేషనల్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణగారు హీరోగా ఆయన 102వ చిత్రాన్ని నిర్మిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. భారీ బడ్జెట్ తో అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం. ఎం.రత్నం అద్భుతమైన కథను అందించారు. "శ్రీరామరాజ్యం, సింహా" వంటి బ్లాక్ బస్టర్ల అనంతరం బాలకృష్ణ సరసన నయనతార నటించనుండడం విశేషం. రాంప్రసాద్ గారు ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తించనుండగా.. బాలయ్య 100వ చిత్రమైన "గౌతమిపుత్ర శాతకర్ణి" చిత్రానికి సంగీత సారధ్యం వహించి చారిత్రక విజయంలో కీలకపాత్ర పోషించిన చిరంతన్ భట్ ఈ చిత్రానికి కూడా సంగీతం సమకూర్చనుండడం విశేషం. రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్ ను నిర్మించాం. ఆగస్ట్ 3 నుండి 30 రోజులపాటు ఇక్కడే చిత్రీకరణ జరగనుంది, కీలకపాత్రధారులతో కీలకసన్నివేశాలు చిత్రీకరించేందుకు దర్శకుడు కె.ఎస్.రవికుమార్ ప్లాన్ చేస్తున్నారు" అన్నారు.
తాజా వార్తలు
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి
- యూఏఈలో పిల్లలకు ఫ్లూ హెచ్చరికలు.. స్కూల్‌కు పంపొద్దని సూచన..!!
- కార్మికుల రిక్రూట్మెంట్ పై వార్న్..SR100,000 వరకు ఫైన్..!!
- ఒమన్‌లో సరికొత్త వ్యవసాయ పరిశోధనలు..!!
- బహ్రెయిన్‌లో వీడియో హెల్త్ సర్వీసులు విస్తరణ..!!
- కువైట్‌లో సీ ట్యాక్సీ, సముద్ర మార్గంలో డెలివరీలు..!!
- ప్రయాణికులు, విమానాల భద్రతకే అత్యధిక ప్రాధాన్యం..!!
- Asian Games 2026: మహిళల క్రికెట్లో భారత్‌కు తొలి స్వర్ణం!
- దుబాయ్-అబుదాబి రైలు టికెట్ల విక్రయాలు ప్రారంభం.. సెప్టెంబర్ 30 నుంచి సేవలు







