యెమెన్‌లో చిన్నారుల హక్కులను ఉల్లంఘిస్తున్న సౌదీ కూటమి :బాలల హక్కుల సంఘాల ఫిర్యాదు

- July 23, 2017 , by Maagulf
యెమెన్‌లో చిన్నారుల హక్కులను ఉల్లంఘిస్తున్న సౌదీ కూటమి :బాలల హక్కుల సంఘాల ఫిర్యాదు

- ఐరాసకు బాలల హక్కుల సంఘాల ఫిర్యాదు 
యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటు దారులపై దాడులుజరుపుతున్న సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ కూటమి అక్కడి బాలల హక్కులను తీవ్రంగా ఉల్లంఘిస్తోందని అక్కడి హక్కుల సంఘాలు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియోగుటెరస్‌కు ఫిర్యాదు చేశాయి. సౌదీ కూటమి జరిపిన 23 వైమానిక దాడుల్లో అనేక మంది బాలలు క్షతగాత్రులు కావటం, మరణించటం జరిగిందని సేవ్‌ది చిల్డ్రన్‌, వాచ్‌లిస్ట్‌ ఆన్‌ చిల్డ్రన్‌ అండ్‌ ఆర్మ్‌డ్‌ కాన్‌ఫ్లిక్ట్‌ సంస్థలు ఈ ఫిర్యాదులో పేర్కొన్నాయి. దాదాపు రెండేళ్లుగా కొనసాగుతున్న ఈ పోరులో బాలలను రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ సంస్థలు ఐరాసకు విజ్ఞప్తి చేశాయి. యెమెన్‌లో ఎక్కడ చూసినా వైమానిక దాడులలో ఛిద్రమైన శిధిలాలే కన్పిస్తున్నాయని, ఇక్కడి బాలల దుర్భర స్థితికి ఇందులో ప్రమేయం వున్న అన్ని వర్గాలూ బాధ్యులేనని సేవ్‌ది చిల్డ్రన్‌ సంస్థ యెమెన్‌ డైరెక్టర్‌ టామర్‌ కిరోలోస్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బాలలను, వారి ప్రయోజనాలను రక్షించటంపైన, దాడులకు బాధ్యులైన వారిని శిక్షించే అంశంపైన ఐరాస ప్రధాన కార్యదర్శి దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com