నాజీల నౌకలో టన్నుల కొద్దీ బంగారం బయటకి తీసే ప్రయత్నం
- July 24, 2017
ఏళ్ళ క్రితం సముద్రంలో మునిగిపోయిన నాజీల ఓడను వెలికితీసేందుకు ట్రెజర్ హంటర్లు భావిస్తున్నారు. ఈమేరకు ఐలాండ్ ప్రభుత్వానికి ధరఖాస్తు కూడ చేసుకొన్నారు.
రెండో ప్రపంచ యుద్దసమయంలో దక్షిణ అమెరికా నుండి జర్మనీకి తరలిస్తున్న టన్నులకొద్దీ బంగారం ముగిగిపోయిన ఓడలో ఉందని ట్రెజర్ హంటర్లు నమ్ముతున్నారు.
1939 రెండో ప్రపంచయుద్దం జరుగుతున్న నేపథ్యంలో దక్షిణ అమెరికా నుండి జర్మనీకి బయలుదేరిన ఈ ఓడను ఇంగ్లాడ్ తన సముద్రజలాల్లో అడ్డుకొని దాడి చేసింది. దాంతో ఓడతో పాటు దక్షిణ అమెరికా నుండి వస్తున్న విలువైన వస్తువులు సముద్ర అంతర్భాగంలో కలిసిపోయాయి.
దాదాపు నాలుగు టన్నుల బంగారం మునిగిపోయిన ఓడలో దాగి ఉందనే పలువురు అభిప్రాయంతో ఉన్నారు. బంగారం విలువ దాదాపు వంద మిలియన్ పౌండ్లు ఉంటుందని భావిస్తున్నారు. ఓడలో ఉన్న బాక్సును వెలికితీసేందుకు బ్రిటన్‌కు చెందిన ఓ కంపెనీల ప్రయత్నాలు చేస్తోంది.
గతంలో ఐలాండ్ సముద్రజలాల్లోకి ప్రవేశించి పరిశోధనలు చేయాలని భావించినా ఆ దేశ ప్రభుత్వం అనుమతి లేకపోవడంతో నేవీ ఒప్పుకోలేదు. దీంతో ఐలాండ్ ప్రభుత్వం నుండి గ్రీన్‌సిగ్నల్ కోసం బ్రిటన్ కంపెనీ ఎదురుచూస్తోంది.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







