జీటెక్స్ టెక్నాలజీ వీక్ ను సందర్శించిన దుబాయ్ అధినేత

- October 20, 2015 , by Maagulf
జీటెక్స్ టెక్నాలజీ వీక్ ను సందర్శించిన దుబాయ్ అధినేత

యూ. ఏ. ఈ. ఉపాధ్యక్షులు మరియు  దుబాయ్ అధినేత  ఐన హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా మరియు దక్షిణ ఏషియా లలోనే ప్రముఖమైన ICT ఈవెంట్ -  జీటెక్స్ టెక్నాలజీ వీక్ ను  సందర్శించారు. ఆధునిక IT ట్రెండ్లు మరియు ఉత్పత్తులు, స్మార్ట్ అప్లికేషన్లు, వ్యాపార లావాదేవీల కోసం సెక్యూరిటీ సొల్యూషన్లు మరియు హాకింగ్ నుండి కాపాడే నెట్ వర్క్ ప్రొటెక్షన్ వంటి వాటిని షేక్ మొహమ్మద్ వారు, దుబాయి ఉపాధ్యక్షులు- షేక్ మక్తౌమ్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, ఉన్నతాధికారుల బృందంతో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా దక్షణ కొరియా వారి 'రోబట్ పెవిలియన్' వద్ద ఆగి, అక్కడ రోబోట్లు అందిచే వివిధ సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఫ్రాన్స్, చైనా, జర్మనీ వంటి దేశాల కు చెందిన సాఫ్ట్ వేర్ జెఈంట్ ఐన మైక్రో సాఫ్ట్, గూగల్, సాంసంగ్, డెల్, ఇంటెల్, జాకీ బిజినెస్ సోలుషన్స్, ఫ్యూజిట్సు, పనసొనిక్, పా, ఎల్. జి. స్టాండ్లను కూడా సందర్శించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com