ఎన్నారైలకు ఆదాయపు పన్నుపై ఇండియా క్లారిటీ
- July 26, 2017
దుబాయ్: ఎన్నారైలు ఇంకమ్ ట్యాక్స్ రిఫండ్స్ కోసం దర్యాప్తు చేసుకోవాల్సి వస్తే, భారతదేశంలో బ్యాంక్ అకౌంట్ లేనివారు ఏం చేయాలన్నదానిపై భారత ప్రభుత్వం ఓ స్పష్టత ఇచ్చింది. తమకున్న విదేశీ బ్యాంకు అకౌంట్ వివరాల్ని పేర్కొంటూ అప్లికేషన్ పూర్తి చేస్తే సరిపోతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇంకమ్ ట్యాక్స్ రిటర్న్ ఫామ్స్ ఫర్ ది అస్సెస్మెంట్స్ ఇయర్ 2017-18 మార్చి 30 నోటిఫై చేయబడిందని మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆ తర్వాతి నుంచి పెద్ద సంఖ్యలో ఎన్నారైలనుంచి ఆదాయపు పన్ను విషయమై అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇండియాలో బ్యాంక్ అకౌంట్ లేని తమకు రిఫండ్స్ ఎలా వస్తాయని వారంతా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఎన్నారైల కోసం విదేశాల్లోని తమ అక్కౌంట్ల వివరాలు తెలిపితే సరిపోతుందని కేంద్రం స్పష్టతనివ్వడం జరిగింది. ఈ నిర్ణయం ఆహ్వానించదగ్గదని దుబాయ్‌లో ఇండియా కాన్సుల్ జనరల్ విపుల్ చెప్పారు. దుబాయ్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా సెక్రెటరీ అనీష్ మెహతా మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్పష్టత ఆహ్వానించదగ్గదని చెప్పారు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







