శుక్ర, శనివారాల్లో దుబాయ్ మెట్రో పాక్షికంగా మూసివేత
- July 27, 2017
దుబాయ్: దుబాయ్ మెట్రో రెడ్‌లైన్‌కి సంబంధించి ఓ సెగ్మెంట్ తాత్కాలికంగా ప్రతి శుక్రవారం మరియు శనివారం మూసివేయబడుతుంది. జులై 28 నుంచి 10 వారాల పాటు ఈ మూసివేత అమల్లో ఉంటుంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రూట్ 2020తో రెడ్‌లైన్ లింక్ కోసం ఈ తాత్కాలిక మూసివేత చేపడుతున్నారు. గత ఏడాది 15 కిలోమీటర్ల పొడవైన 2020 రూట్ పనులు చేపట్టబడ్డాయి. నకీల్ హార్బర్ మరియు టవర్ స్టేషన్‌ని ఎక్స్‌పో 2020 సైట్‌తో ఈ మార్గం కనెక్ట్ చేస్తుంది. జుమైరా లేక్ టవర్స్ మరియు ఐబిఎన్ బట్టుట మెట్రో స్టేషన్ల మధ్య ఉచిత సర్క్యులర్ బస్, ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది. మూసివేత అమల్లో ఉన్నన్ని రోజులూ ఈ బస్ సేవలు అందిస్తుంది. 2020 రూట్ 10.6 బిలియన్ దిర్హామ్‌లతో చేపడుతున్నారు. 2019 చివరి నాటికి ఇది పూర్తవుతుంది. 2020 మే 20 నుంచి ఈ రూట్ అందుబాటులోకి వస్తుంది.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్







