యాత్రీకుల రాక: ఏర్పాట్లు పూర్తి చేసిన హజ్ మినిస్ట్రీ
- July 27, 2017
జెడ్డా: మినిస్ట్రీ ఆఫ్ హజ్ అండ్ ఉమ్రా, భూ మార్గం, జల మార్గం, ఆకాశ మార్గాల్లో యాత్రీకులు రావడం మొదలైనట్లు ప్రకటించింది. ఆదివారం కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ద్వారా 325 మంది యాత్రీకులు చేరుకున్నారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన తొలి హజ్ విమానం ఇది. 651 మందితో కూడిన మూడు విమానాలు మదీనా ఎయిర్‌పోర్ట్‌కి పాకిస్తాన్ నుంచి చేరుకున్నాయి. మరికొన్ని అంతర్జాతీయ విమానాలు చేరుకోనున్నాయి. మినిస్టర్ ఆఫ్ హజ్ అండ్ ఉమ్రా మొహమ్మద్ సలిహ్ బెంటిన్ సూచనల మేరకు మినిస్ట్రీ హజ్ యాత్రీకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మినిస్ట్రీ కింద పనిచేసే అన్ని సెక్టార్స్, యాత్రీకులకు తగిన రీతిలో సౌకర్యాలు కల్పించాలనీ, ప్రార్థనలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మక్కా మరియు మీదానాల్లోని హజ్ సర్వీస్ సెంటర్స్ యాత్రీకులకు తగు సూచనలు చేయాలని, వారికి అవసరమైన సేవలందించాలని కూడా ఆదేశించారు మినిస్టర్. పవిత్ర రమదాన్ మాసంలో ఉమ్రా ప్రార్థనల సందర్భంగా 3 మిలియన్ మంది యాత్రీకులు 30 రోజుల్లో వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్‌పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్‌లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!