బాలకృష్ణ నటించిన 'పైసా వసూల్' స్టంపర్ అదిరింది
- July 28, 2017
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం పైసా వసూల్. శ్రేయ, ముస్కాన్, కైరాదత్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సెప్టెంబర్ 29న చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ రోజు పైసా వసూల్ స్టంపర్ అంటూ చిన్న టీజర్ విడుదల చేశారు. ఇందులో బాలయ్య డైలాగ్స్, పూరీ టెకింగ్, అనూప్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తుంది. ఈ మూవీ పక్కా యాక్షన్ మూవీ అని డైలాగ్స్ తో చెప్పకనే చెప్పారు. కొత్తరకం స్టైల్ తో మొదలైన ఈ ప్రమోషన్ సినిమా రిలీజ్ వరకు ఇంకా ఏఏ రూట్లో వెళుతుందో అని ఫ్యాన్స్ ఆలోచనలు చేస్తున్నారు . ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు తెలుస్తుండగా ఒక పాత్రలో టాక్సీ డ్రైవర్ గా మరో పాత్రలో మాఫియా డాన్ గా కనిపించనున్నట్టు సమాచారం. భవ్య క్రియేషన్స్ బేనర్ పై రూపొందుతున్న పైసా వసూల్ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. అలీ, పృథ్వీ, విక్రమ్జిత్ సహా బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ ఇందులో ప్రత్యేక పాత్ర పోషించారు.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







