బలపరీక్షలో నెగ్గిన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్
- July 28, 2017
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ఎదుర్కొన్న బలపరీక్షలో విజయం సాధించింది. మేజిక్ ఫిగర్ 122 కాగా ఆయనకు అనుకూలంగా 131, వ్యతిరేకంగా 108 ఓట్లు వచ్చాయి. బలపరీక్షలో భారీగా క్రాస్ ఓటింగ్ చేసినట్లు తెలుస్తోంది. గురువారం జనతా దళ్ యూనైటెడ్(జేడీయూ), భారతీయ జనతా పార్టీల కూటమి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్ధానాలు ఉన్నాయి. జేడీయూ, బీజేపీలకు 132 మంది ఎమ్మెల్యేల(జేడీయూ 71, బీజేపీ 53, ఆర్‌ఎల్‌ఎస్‌పీ 2, ఎల్‌జేపీ 2, హెచ్‌ఏఎం 1, ముగ్గురు స్వతంత్రులు) మెజారిటీ ఉంది. నితీశే తమ ముఖ్యమంత్రిగా ఉండాలని భావించిన కొందరు విపక్ష ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు. దీంతో నితీశ్ కుమార్ ప్రభుత్వం బలనిరూపణ పరీక్షలో భారీ మెజారిటీతో గెలుపొందింది. కాగా బలపరీక్షకు ముందు విపక్ష కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు ప్లకార్డులతో నితీశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తాజా వార్తలు
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం







