'నాయకుడు' గా కమల్

- July 28, 2017 , by Maagulf
'నాయకుడు' గా కమల్

కమల్‌హాసన్ రాజకీయాల్లోకి రాబోతున్నాడంటూ గత కొంతకాలంగా వార్తలు గుప్పుమంటున్నాయి. అధికారికంగా ఎటువంటి ప్రకటనలు రాకపోయినా.. ఆ నేపథ్యంలో కమల్ హాసన్ చేసే ట్వీట్స్ కూడా కాస్త ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో కమల్ చేస్తున్న కొత్త సినిమాకు 'తలైవన్ ఇరుక్కిఱాన్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇంతకీ ఈ టైటిల్ అర్ధమేంటో తెలుసా.. 'నాయకుడు ఉన్నాడు' అని. పూర్తి రాజకీయ నేపథ్యంలో ఈకథాంశం ఉండబోతుందని తెలిసింది. చిత్రంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నాడట. చిత్రాన్ని తమిళ, హిందీ భాషల్లో విడుదలచేయనున్నారు. ఇదిలా ఉంటే కమల్ హాసన్ నటించిన 'విశ్వరూపం 2', 'శభాష్ నాయుడు' చిత్రాలు ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com